MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food
  • పురుషులు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..

పురుషులు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..

చాలా మంది పురుషులు ఫుడ్ విషయంలో అస్సలు జాగ్రత్తలు తీసుకోరు. ఆకలి అయ్యిందా? ఏదైనా తిన్నామా? కడుపు నింపుకున్నామా? అన్నట్టే ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పురుషులకు కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి. వాటిని ఖచ్చితంగా తినాలి. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 21 2024, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పురుషులు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా ఆహారం విషయంలో.. మీకు తెలుసా? మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే  ఆరోగ్యం బాగుంటుంది. అందుకే పురుషులు తమ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన కొన్ని  ఆహారాలు ఉన్నాయి. వీటిని తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే సంతానోత్పత్తిని పెంచుతాయి. మరి పురుషులు రెగ్యులర్ గా తినాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
fiber

fiber

ఫైబర్ ఫుడ్

పురుషులు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో ఫైబర్ ఒకటి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను మగవారు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్ ను తింటే డయాబెటిస్  వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో అపానవాయువు (పిత్తులు) ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

37

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కవుగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శరీరానికి అవసరమైన కొవ్వులలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒకటి. ఇవి శరీరానికి, మెదడుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలలో చేపలు ఒకటి. అందుకే సార్డినెస్, సాల్మన్ వంటి చేపలను తినండి. 
 

47

గింజలు 

గింజలను కూడా పురుషులు తప్పకుండా తినాలి. గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడతాయి.అంతేకాదు పురుషులు రోజూ గింజలను తినడం వల్ల వారి సంతానోత్పత్తి పెరుగుతుంది. 

57
Tomatoes

Tomatoes

టమాటాలు

టమాటాలు కూడా పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాల్లో ఉండే లైసోపిన్, పొటాషియం, విటమిన్ సి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే టమాటాలను తినడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ సమస్యలు నయమవుతాయి. 

67

పొటాషియం 

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలను పురుషులు ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఇది రక్తపోటును నియంత్రించడానికి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే  పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, బచ్చలికూరను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. 
 

77

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది మీ గుండెను రక్షిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved