దీపావళి నాటికి బరువు తగ్గాలా.. ఇలా తింటే చాలు..!
ఈ వారం రోజుల్లోనే మీరు బరువు తగ్గి కనిపించాలి అనుకుంటే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో, ఏం తింటే బరువు తగ్గుతామో ఇప్పుడు తెలుసుకుందాం…
భారతదేశంలో జరుపుకునే అత్యంత అతి పెద్ద పండగలలో దీపావళి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండగను చాలా సంబరంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుగు గెలిచిన విజయంగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే.. ఈ పండగ వేళ అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం.. కాస్త అయినా బరువు తగ్గితే బాగుండు అని కోరుకుంటారు. నిజానికి పండగకు మనకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వారం రోజుల్లోనే మీరు బరువు తగ్గి కనిపించాలి అనుకుంటే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో, ఏం తింటే బరువు తగ్గుతామో ఇప్పుడు తెలుసుకుందాం…
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం అంత సులువేమీ కాదు. చాలా తక్కువ సమయంలో బరువు తగ్గడం చాలా కష్టం. కానీ.. ఆహారం హెల్దీగా , మేం చెప్పే డైట్ ని క్రమం తప్పకుండా ఫాలో అయితే.. కచ్చితంగా మీ బరువులో తేడా చూస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం తినాలో ఇప్పుడు చూద్దాం..
ఉదయం లేవగానే… మీ ఉదయాన్ని ఒకటేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటీలో వేసుకొని తాగాలి. ఇలా డేని మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే.. ఆ నీటిలో అల్లం కూడా వేసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ తాగిన అరగంట తర్వాత… కనీసం నాలుగైదు బాదం పప్పులను తినాలి. వీటిని రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే తినడం మరింత మంచిది.
బ్రేక్ ఫాస్ట్..
ఇక బ్రేక్ ఫాస్ట్ లో ఒక గ్లాసు స్కిమ్డ్ మిల్క్. రెండు గుడ్డులోని తెల్లసొన, బటర్ లేదా జామ్ లేకుండా రెండు బ్రౌన్ బ్రెడ్స్ తో చేసిన టోస్టులను తినాలి.
స్నాక్స్
ఉదయం 11 గంటల తర్వాత మీకు ఆకలిగా అనిపిస్తే, బిస్కెట్‌కు బదులుగా ఒక పండు తినండి. అరటిపండు తప్ప ఏదైనా పండు తినవచ్చు.
మధ్యాహ్న భోజనం
మధ్యాహ్నం 1 నుంచి 1:30 గంటల మధ్య భోజనం చేయండి. మీ మధ్యాహ్న భోజనంలో అరకప్పు అన్నం, సగం గిన్నె ఏదైనా కూరగాయతో చేసిన కూర, అరకప్పు పప్పు ఉండాలి. మీరు మీడియం-సైజ్ చేప లేదా చికెన్ బ్రెస్ట్ చిన్న ముక్కను కూడా తినవచ్చు. ఉప్పు లేకుండా సలాడ్ తినండి. రుచి కోసం మీ సలాడ్‌పై కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవచ్చు.
సాయంత్రం అల్పాహారం
సాయంత్రం 4 గంటలలోపు మీకు ఆకలిగా అనిపిస్తే, మీరు ఒక కప్పు గ్రీన్ టీ, రెండు బిస్కెట్లు తీసుకోవచ్చు. అతిగా తినవద్దు..
dinner
భోజనానికి ముందు ఆహారం
రాత్రి 7 గంటలకు ఒక కప్పు అల్లం, మిరియాలు కలిపిన కూరగాయల సూప్ లేదా నిమ్మరసంతో అరకప్పు చిక్‌పీస్ తీసుకోండి. ఉప్పును వీలైనంత వరకు నివారించేందుకు ప్రయత్నించండి.
డిన్నర్
రాత్రి 8:30 గంటలకు డిన్నర్ చేయండి, మీ డిన్నర్‌లో సగం గిన్నెలో ఉడికించిన కూరగాయలు, చపాతీ ఉండాలి. గోరువెచ్చని నీటిలో 1/2 టీస్పూన్ అల్లం రసం ,ఒక చుక్క నిమ్మరసం కలపండి పడుకునే ఒక గంట ముందు త్రాగాలి. ఈ పానీయం మీ జీవక్రియను పెంచుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.