MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • కూర, సాంబార్, బిర్యానీలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

కూర, సాంబార్, బిర్యానీలో కారం ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?

స్పైసీ వంటను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ ఉండాల్సిన దానికంటే మరీ ఎక్కువ కారం ఉంటే కూడా వంటలను తినడం కష్టమే. అందుకే వీటిలో కారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 23 2024, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిజంగా వంట చేయడమొక కళ. ఇది అందరికీ రాదు. అందరూ వంటచేస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే పర్ఫెక్ట్ గా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది అయితే రాని వంటలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో చూసి ఇంట్లో ట్రై చేస్తుంటారు.

దీనివల్ల చాలా సార్లు కూరల్లో కారం ఎక్కువ అవుతుంటుంది. కానీ కారం ఎక్కువైన వంటలను తినడం కష్టం. అందుకే కారంగా ఉండే వంటలు డస్ట్ బిన్ పాలవుతుంటాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఎంత కారాన్నైనా చాలా సులువుగా తగ్గించొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వంటలో కారం ఎక్కువైతే ఏం చేయాలి? 

కూరల్లో కారం ఎక్కువైతే చాలా మంది కంగారు పడిపోతుంటారు. ఏం చేయాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కారం తగ్గాలంటే దాంట్లో కొంచెం ఉప్పు, చింతపండు రసం వేసి మరిగించండి. వీటి వల్ల కారం కొంచెం తగ్గుతుంది. 

చాలా సార్లు సాంబార్ కూడా మరీ కారంగా అవుతుంటుంది. సాంబార్ లో కారాన్ని తగ్గించడం చాలా సింపుల్. ఇందుకోసం కొంచెం పెసర పప్పును ఉడికించి సాంబార్ లో కలపండి. లేదా మీరు సాంబార్ లో వేసిన కూరగాయలను మరిన్ని కట్ చేసి వేయించి అందులో కొంచెం సాబార్ వేసి మరిగించి మిగతా సాంబార్ లో కలిపితే సరిపోతుంది. అయితే సాంబార్ లో ఉప్పు తక్కువగా ఉన్నా కూడా కారంగా అనిపిస్తుంది. కాబట్టి సాంబార్ లో ఉప్పును సరిపడా వేయండి. 
 

35

సాంబార్ లో స్పైసీ బాగా ఎక్కువైతే మీరు దీంట్లో టామాటాలను వేసి బాగా వేయించండి. మసాలా ఘాటు ఎక్కువగా ఉంటే దాంట్లో కొబ్బరి తురుము లేదా బెల్లం ముక్కను వేసి కాసేపు మరిగిస్తే సాంబార్ టేస్టీగా అవుతుంది. 

చపాతీ గ్రేవీ కారమైతే పెద్దగా టెన్షన్ పడకండి. దీంట్లో  కారం తగ్గడానికి అందులో కొంచెం చక్కెర లేదా బెల్లాన్ని వేసి కరిగించండి. లేదనుకుంటే మీరు దీంట్లో పెరుగు, కొబ్బరి పాలు వంటివి కూడా వేయొచ్చు. ఇవి కూడా కారాన్ని తగ్గిస్తాయి.

45

ఫ్రైస్ లల్లో కూడా కారం ఎక్కువగా అవుతుంటుంది. ముఖ్యంగా ఆలూ, అరట,  యమ్ మొదలైనవి ఫ్రైస్ లో కారం కొంచెమే వేసినా ఎక్కువగా అవుతుంది. ఇలాంటప్పుడు వీటిలో స్పైసీని తగ్గించుకోవడానికి బంగాళాదుంపను మెత్తగా పేస్ట్ చేసి పైన చల్లుకుంటే సరిపోతుంది. 

55

కొన్ని కొన్ని సార్లు బిర్యానీ కూడా బాగా కారం కారంగా అవుతుంటుది. మీకు తెలుసా? బిర్యానీలో కొంచెం నిమ్మరసం వేసి కలిపితే స్పైసీ చాలా వరకు తగ్గుతుంది. అలాగే లెమన్ రైస్, కొబ్బరి అన్నం, టమాటా రైస్ వంటి వాటిలో కారం ఎక్కువైతే అందులో తెల్ల అన్నం వేసి కలపండి.

దీనివల్ల కారం అస్సలు ఉండదు. అలాగే గ్రేవీలు కారంగా అయితే వాటిలో ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా చేసి వాటిలో వేయండి. లేదా గసగసాలను, కొబ్బరిని మెత్తగా రుబ్బుకోని గ్రేవీలో వేసి ఉడికించండి. దీనివల్ల మసాలా ఘాటు తగ్గుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Recommended image2
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image3
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved