ఈ ఒక్కటి తాగినా.. గ్యాస్ తో ఉబ్బిన కడుపు నార్మల్ అవుతుంది
గ్యాస్ వల్ల కడుపు బెలూన్ లా ఉబ్బిపోతుంది. అలాగే పుల్లని త్రేన్పులు వస్తాయి. ఉబ్బరంగా, ఊపిరిరాడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలను ఒక డ్రింక్ చిటికెలో తగ్గిస్తుంది. అదేంటంటే?
ఈ రోజుల్లో కడుపులో గ్యాస్ ఏర్పడటం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో సతమతవుతున్నారు. ఈ గ్యాస్ సమస్య వల్ల ఊపిరి ఆడనట్టుగా, ఉబ్బరసంగా అనిపిస్తుంది. అంతేకాదు దీని నుంచి వచ్చే దుర్వాసన కూడ ఇబ్బంది పెడుతుంది.
acidity
గ్యాస్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. హెవీగా తినడం, తిన్నది అరగకపోవడం, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి కారణాల వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అలాగే తిన్నతర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని కొన్ని సార్లు శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్ల కూడా జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అయితే కడుపు గ్యాస్, బెల్చింగ్, దుర్వాసన, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించుకోవడానికి మీ కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
రెండు పదార్థాలతో తయారుచేసిన టీ తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. అవేంటో కాదు సోంపు, అల్లం. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ రెండింటితో తయారుచేసిన టీ తాగితే మీ కడుపు ఆరోగ్యంగా, ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది.
ఏ టీ తాగితే కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది
సోంపు, అల్లంతో తయారుచేసిన టీ మిమ్మల్ని జీర్ణక్రియకు సంబంధించిన సమస్య నుంచి రక్షిస్తుంది. ఈ టీ తాగితే అజీర్ణం ఉండదు. అలాగే గ్యాస్ సమస్య చిటికెలో తగ్గిపోతుతుంది.
సోంపు ప్రయోజనాలు
సోంపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం సమస్యలను తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి. సోంపులోనే కాదు అల్లంలో కూడా జీర్ణ లక్షణాలుంటాయి.
వీటితో తయారుచేసిన టీ మీ జీర్ణవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. దీంతో మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, కడుపులో గ్యాస్ ఏర్పడి బరువుగా అయినా ఈ టీని తాగండి. వెంటనే ఉపశమనం పొందుతారు.
అల్లం ప్రయోజనాలు
అల్లంలో ఉంటే ఔషద లక్షణాలు జీర్ణరసాల స్రావాన్ని పెంచుతాయి. దీంతో మీరు తిన్నతి సులభంగా జీర్ణమవుతుంది. నిపుణుల ప్రకారం.. సోంపు, అల్లంతో తయారుచేసిన టీని తాగితే అపానవాయువు (పిత్తులు) తగ్గిపోతాయి. అలాగే గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
ఈ టీ గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే బాగా ఆకలి అనిపించిన వారు, తిన్న తర్వాత వికారంగా, వాంతికి వచ్చినట్టుగా అనిపించిన వారు కూడా ఈ టీని తాగొచ్చు. దీన్ని రోజుకు ఒకటిరెండు సార్లు తాగితే మీ పొట్ట శుభ్రపడుతుంది.
గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించే టీని ఎలా తయారుచేయాలి.
కావాల్సిన పదార్థాలు
జీలకర్ర - 1 టీ స్పూను
అల్లం - 1/2 అంగుళం
తయారుచేసే విధానం
ముందుగా ఒక గ్లాస్ నీటిలో సోంపు, అల్లాన్ని వేసి బాగా మరిగించాలి. ఈ వాటర్ రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసి తాగండి. అంతే వేడి వేడి టీ రెడీ అయినట్టే. ఈ టీ తాగితే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉండవు.