కోడిగుడ్డు కాదు.. చియా ఎగ్ తినండి.. ఎంత మంచిదో తెలుసా?
చియా ఎగ్ గురించి తెలుసా? కోడిగుడ్డు విన్నాం కానీ.. ఈ చియా ఎగ్ ఏంటి..? దీనితో మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాం…
chia seeds
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి చాలా మంది చియా సీడ్స్ ని తమ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. చియా సీడ్స్ గురించి మీ అందరికీ తెలుసు మరి.. చియా ఎగ్ గురించి తెలుసా? కోడిగుడ్డు విన్నాం కానీ.. ఈ చియా ఎగ్ ఏంటి..? దీనితో మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాం…
చియా సీడ్స్ లో ఫైబర్, ప్రోటీన్ తో పాటు చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని స్మూతీస్, పుడ్డింగ్స్, సలాడ్, ఎనర్జీ బార్ వంటి వాటిల్లో కలిపి తీసుకోవచ్చు. కోడిగుడ్డును మించిన ప్రోటీన్ ఈ చియా సీడ్స్ లో ఉంటుంది. నలుపు, తెలుపు రంగులలో ఉండే ఈ చియాసీడ్స్ తో చియా ఎగ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
chia seeds
చియా ఎగ్ అంటే ఏంటి..?
చియా ఎగ్ అంటే స్పెషల్ ఏమీ కాదు.. చియా సీడ్స్ తోనే తయారు చేస్తారు. ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ని రెండున్నర టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో నానపెట్టాలి. అలా నానపెట్టినప్పుడు చిక్కగా తయారౌతుంది. దీనినే చియా ఎగ్ అని పిలుస్తారు. కోడిగుడ్డు తినని శాకాహారులు… ఈ చియా ఎగ్ తింటే చాలు. మరి.. ఈ చియా ఎగ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం
ప్రోటీన్ కోసం చియా ఎగ్…
మీరు మీ భోజనంలో ప్రోటీన్ ఉండాలి అంటే.. కచ్చితంగా చియా ఎగ్ ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే… ఈ చియా ఎగ్ లో ప్రోటీన్.. కోడిగుడ్డులో కన్నా ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల చియా గింజల్లో 17 గ్రాముల ప్రోటీన్ తో పాటు 595 మిల్లీ గ్రాముల కాల్షియం, 326 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 691మిల్లీ గ్రాముల పాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజమైన కోడిగుడ్డులో కేవలం 10.7 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది.
Chia Seeds
చియా ఎగ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
1. జీర్ణక్రియకు మంచిది
చియా గింజల్లో 30 నుండి 34 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. 2019లో న్యూట్రియెంట్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఇందులో 7 నుండి 15 శాతం వరకు కరిగే ఫైబర్ ఉంటుంది.ఇది తినడం వల్ల మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.
2. గుండె జబ్బులను నివారించడంలో సహాయపడవచ్చు
చియా విత్తనాలు మొక్కల ఆధారిత ఒమేగా-3 కి మంచి సోర్స్. ఇది ట్రైగ్లిజరైడ్-తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటుంది. గుండె సంబంధ సమస్యలను నివారించడానికి ఇది సహాయపడవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేటప్పుడు అవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి.
యవ్వనంగా ఉంచే సీడ్స్..
ఈ ఆరోగ్యకరమైన విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్ నుండి మిమ్మల్ని రక్షించగలవు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు అని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడటంలోనూ సహాయపడుతుంది.
గ్లూటెన్-ఫ్రీ, అలెర్జీ-ఫ్రెండ్లీ
చియా గింజలతో తయారు చేసినన చియా గుడ్డు, సహజంగా గ్లూటెన్ రహితమైనది. సెలియక్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.గుడ్డు అలెర్జీ ఉన్న వ్యక్తులు కూడా చియా గుడ్డును తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది సాంప్రదాయ గుడ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.