Weight loss: రోజూ దోశ తిని కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?
దోశ తిని బరువు తగ్గడం: మనం రోజూ ఇంట్లో తయారు చేసుకునే దోశ తిని కూడా ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? మీరు నమ్మకపోయినా ఇదే నిజం. దోశ తినేసి బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం లేస్తే.. మన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ లు ఏముంటాయి..? దాదాపు అందరి ఇళ్లలో కామన్ గా వినపడేది ఇడ్లీ, దోశ. కానీ... బరువు తగ్గాలి అనుకునేవాళ్లు మాత్రం.. ఇడ్లీ, దోశలు తినరు. ఇవి తింటే బరువు తగ్గడం కాదు.. ఇంకాస్త పెరుగుతాం అని అంటూ ఉంటారు. బరువు తగ్గాలంటే.. ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తినాలని, ప్రోటీన్ షేక్ లు తాగాలని నిపుణులు కూడా చెబుతుంటారు. కానీ... మనం రోజూ ఇంట్లో తయారు చేసుకునే దోశ తిని కూడా ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? మీరు నమ్మకపోయినా ఇదే నిజం. దోశ తినేసి బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం..
dosa
సాధారణంగా మనం ఇంట్లో దోశను తయారు చేయడానికి మినపప్పు, బియ్యం వాడతాం. ప్రోబయోటిక్ ఆహారమైన ఈ దోశ లో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దోశలోని అన్ని పోషకాలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. అంతేకాదు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఏమీ రావు. షుగర్ పేషెంట్స్ తో పాటు.. బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది బెస్ట్ అల్పాహారం.
dosa
దోశలోని పోషకాలు...
ఓ సాదా దోశ ను తయారు చేయడానికి 40 నుంచి 45 గ్రాముల పిండి అవసరం అవుతుంది. దీని మొత్తం కేలరీల సంఖ్య 168. దీనిలో 29 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3.7 గ్రాముల ఫ్యాట్, 4 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము ఫైబర్, 94 మిల్లీగ్రాముల సోడియం, 76 మిల్లీ గ్రాముల పొటాషియం, మరో రెండు మూడు గ్రాముల ఇంతర ఫ్యాట్స్ ఉంటాయి. ఈ దోశ తినడం వల్ల మనకు విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ లభిస్తాయి.
మరి దోశ తిని ఎలా బరువు తగ్గొచ్చు..?
హోటళ్ళు, రెస్టారెంట్లలో లభించే దోశ తినడం ద్వారా మీరు బరువు తగ్గలేరు. ఎందుకంటే వారు అక్కడ దోశలో నెయ్యి ,నూనె ఎక్కువగా పోస్తారు, ఇది కేలరీలను ఎక్కువగా చేస్తుంది. అదేవిధంగా, మీరు కొబ్బరి చట్నీతో తింటే దోశ బరువు తగ్గడానికి సహాయపడదు. మీరు ఇంట్లో తయారు చేసుకొని, తక్కువ నూనెతో తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా పెసరట్టు తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
ఉదయం దోశ తినడం వల్ల రోజులోని పోషక అవసరాలు పాక్షికంగా తీరుతాయి. ఇందులో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి ఇది బరువు తగ్గడానికి తప్పనిసరిగా తినాలి. దోశ పిండిని పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు కాబట్టి, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. దోశ కాల్చేటప్పుడు ఎక్కువ నూనె పోయకండి. మీరు మీ కేలరీలను పెంచుకుంటే, మీరు దోశ తినడం ద్వారా బరువు తగ్గలేరు. దోశ ను ప్లెయిన్ గా కాకుండా క్యారెట్, కొత్తిమీర లాంటివి చేర్చి తినడ మంచిది.దోశలోని ప్రోటీన్ మన కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది మనం రోజూ తీసుకునే కేలరీల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
Dosa
పీచు పదార్థం ఉన్న ఆహారాలు ఎల్లప్పుడూ జీర్ణక్రియకు సహాయపడతాయి. . ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు తినడం వల్ల బరువు పెరగదు.దోశ తినడం వల్ల శరీరానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. దోశ సమతుల్య పోషక ఆహారం ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
దోశ తయారీలో ముఖ్యమైన పదార్థమైన మినపప్పులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం బరువు తగ్గడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే.. రోజుకి నాలుగైదు దోశలు తిని మేం బరువు తగ్గలేదు అని మీరు అనకూడదు. మీడియం సైజు దోశ ఒకటి మాత్రమే తినాలి. అప్పుడు మాత్రమే బరువు తగ్గడం సాధ్యం అవుతుంది.