బనానా స్మూతీ ఆరోగ్యానికి మంచిది కాదా..? ఎందుకు..?
స్మూతీ చేసే సమయంలో అరటి పండుతో పాలు కూడా కలుపుతారు. ఈ రెండింటి కాంబినేషన్ మంచిదేనా..? ఈ పండును ఎలా తీసుకోవడం ఉత్తమం..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే పండు అరటి. మిగిలిన పండ్లతో పోలిస్తే కాస్త చవక అని కూడా చెప్పొచ్చు. అయితే... చాలా మందికి అరటి పండుని పండులా కంటే... స్మూతీ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. అందులో అయితే.. ఇతర పోషకాలు కూడా ఉంటాయి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అది నిజమేనా..? ఎందుకంటే.. స్మూతీ చేసే సమయంలో అరటి పండుతో పాలు కూడా కలుపుతారు. ఈ రెండింటి కాంబినేషన్ మంచిదేనా..? ఈ పండును ఎలా తీసుకోవడం ఉత్తమం..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
సాధారణంగా అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దానిలో పోషకాలు చాలా నిండి ఉంటాయి. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇదే పండుతో తయారు చేసే స్మూతీ పరిస్థితి ఏంటి..? దీనిని కూడా అరటి పండుతోనే చేస్తారు. కానీ... స్మూతీ తయారు చేసేటప్పుడు అందులో పాలు కూడా మిక్స్ చేస్తాం. నిజానికి బ్లెండర్ లో పండ్లను వేసి స్మూతీగా చేయడం వల్ల.. దానిలోని ఫైబర్ తగ్గిపోతుందట. అందుకే.. వీలైనంత వరకు పండ్లను బ్లెండ్ చేయడం మానేయాలట.
అందరూ ఇష్టంగా తీసుకునే బనానా స్మూతీ... ఆయుర్వేదం ప్రకారం అస్సలు మంచిది కాదట. ఎందుకంటే.. ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండు, పాలు ఈ రెండు విభిన్న రూపాలను కలిగి ఉంటాయట. ఈ రెండు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ సమస్య కూడా రావచ్చట. జలుబు, దగ్గు, దద్దుర్లు ,అలెర్జీలకు కారణమవుతాయి.
మరోవైపు, బాడీబిల్డర్లు ,బరువు పెరగాలనుకునే వారికి , అధిక-తీవ్రతతో పని చేయడానికి శక్తి అవసరమయ్యే వ్యక్తులకు పాలతో కూడిన అరటిపండు తీసుకోవచ్చట. బరువు తగ్గాలి అనుకునేవారికి మాత్రం ఇది అస్సలు సెట్ అవ్వదట. అయినప్పటికీ, ఉబ్బసం వంటి అలెర్జీలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే.. శ్వాస సంబంధిత సమస్యలు కలిగిస్తాయట.
ఒక భోజనంలో అరటి పండు, పాలు.. రెండింటినీ విడిగా తీసుకోవచ్చు, అది ఎటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీయదు. రెండింటినీ కలిపి తీసుకుంటేనే సమస్య వస్తుంది. కాబట్టి.. స్మూతీలాగా తీసుకోకూపోవడమే మంచిది.