బిస్కెట్లతో నోరూరించే స్వీట్స్ ఎలా చేయాలో తెలుసా?
కానీ, మీకు తెలుసా మనకు లభించే సింపుల్ బిస్కెట్లతో నోరూరించే డెసర్ట్స్ తయారు చేయవచ్చు. మరి వాటిని ఎలా చేయాలో ఓసారి చూద్దాం..
ప్రతి ఒక్కరు ఇంట్లో బిస్కెట్లు దొరుకుతాయి. అది చాలా కామన్. దాదాపు పిల్లలు ఉన్న అందరు ఇళ్లల్లో బిస్కెట్లు ఉంటాయి. వాటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాదు.. బిస్కెట్ల ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. అందరూ ఈజీగా కొనేస్తూ ఉంటారు. కానీ, మీకు తెలుసా మనకు లభించే సింపుల్ బిస్కెట్లతో నోరూరించే డెసర్ట్స్ తయారు చేయవచ్చు. మరి వాటిని ఎలా చేయాలో ఓసారి చూద్దాం..
biscuit cake
1.బిస్కెట్ తో యమ్మీ కేక్..
మీకు తెలుసో తెలీదో... బిస్కెట్స్ తో కమ్మని చాక్లెట్ కేక్ తయారు చేయవచ్చు. ముందుగా బిస్కెట్లను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దానిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. దాంట్లో పాలు కూడా కలిపి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిని ఓవెన్ లేకపోయినా... స్టవ్ మీద కేక్ బేస్ లో వేసుకోవాలి. కేవలం 30నిమిషాల్లో కేక్ తయారౌతుంది. కేక్ ఆరిన తర్వాత మెల్ట్ చేసిన చాక్లెట్ పైన వేసుకుంటే సరిపోతుంది.
2.బిస్కెట్ ట్రఫెల్స్..
ముందుగా బిస్కెట్లను మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తర్వాత అందులో చీజ్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వాటిపై కోకో పౌడర్ ని , షుగర్ పౌడర్, నట్స్ ని పైన కోటింగ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ అదిరిపోతుంది.
3.బిస్కెట్ పుడ్డింగ్...
ముందుగా బిస్కెట్లను పాలతో కానీ.. పాలతో చేసిన కాఫీలో మంచిగా సోక్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని.. పాలతో కలిపిన బిస్కెట్ మిశ్రమాన్ని వేయాలి. దానిపైన మీరు చాక్లెట్ పుడ్డింగ్ కానీ, వెనిలీ పుడ్డింగ్ కానీ వేయాలి. తర్వాత.. మరోక లేయర్ బిస్కెట్ లేయర్ వేయాలి. ఇలా రెండు, మూడు లేయర్స్ లాగా వేసి.. దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే... టేస్ట్ అదిరిపోతుంది.
4.బిస్కెట్ ఐస్ బాక్స్ కేక్..
ఒక బేకింగ్ డిష్ లో.. ఒక లేయర్ గా బిస్కెట్లు.. మరో లేయర్ గా.. విప్ప్డ్ క్రీమ్ ని మరో లేయర్ గా వేయాలి. ఇలా నాలుగు ఐదు లేయర్స్ లాగా వేసి.. దానిని ఫ్రిడ్జ్ లో నైట్ అంతా పెట్టాలి. అలా చేయడం వల్ల.. బిస్కెట్లు చాలా సాఫ్ట్ గా మారతాయి. మొత్తం కలిపి తీసుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ఐస్ కేక్ లాగానే టేస్ట్ కూడా ఉంటుంది.