గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గ్రీన్ టీని ఎలా పడితే అలా మాత్రం తాగకూడదట. దీనిని తాగే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
మనలో చాలా మంది గ్రీన్ తాగుతూ ఉంటారు. గ్రీన్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలిసిందే. దీనిని తరచూ తాగడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గ్రీన్ టీని ఎలా పడితే అలా మాత్రం తాగకూడదట. దీనిని తాగే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
green tea
గ్రీన్ తాగడం మంచిదే. కానీ మధ్యాహ్నం కానీ, రాత్రి పూట కానీ భోజనం చేసిన వెంటనే మాత్రం ఈ టీ తాగకూడదు. కొద్ది సేపు ఆగిన తర్వాత తాగవచ్చు. కానీ, వెంటనే మాత్రం తాగకూడదు.
green tea
చాలా మందికి వేడి వేడిగా టీ తాగడం నచ్చుతుంది. అయితే, గ్రీన్ టీ మాత్రం వేడి వేడిగా తాగకూడదట. కొంచెం వేడి తగ్గిన తర్వాత తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక గ్రీన్ టీని కొంచెం చేదుగా ఉన్నప్పుడు తాగడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా తాగడం వలనే ఎక్కువ ప్రయజనాలు ఉన్నాయట.
గ్రీన్ టీ తాగడానికి ముందు, గ్రీన్ టీ తాగిన తర్వాత పొరపాటున కూడా మెడిసిన్స్ వేసుకోకూడదు. మెడిసిన్స్ వేసుకోవడానికి కొంత గ్యాప్ ఇవ్వాలి.
చాలా మందికి గ్రీన్ టీ తాగడం నచ్చదు. దానికోసం ఆ రుచి నుంచి తప్పించుకోవడానికి పాలు కలుపుతూ ఉంటారు. కానీ, గ్రీన్ టీలో పాలు కలుపుకోడదట.
tea
గ్రీన్ టీ చేదుగా ఉంటుంది కదా. అని అందులో స్వీటనర్స్ , షుగర్ కలుపుతూ ఉంటారు. ఇవి కలుపుకోకూడదు. దానికి బదులు తేనె వాడటం మంచిది.
green tea
ఇక గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కేవలం గ్రీన్ టీ తాగితే బరువు తగ్గరట. దానితో పాటు డైట్ ఫాలో అయితేనే బరువు తగ్గుతారు. ఈ విషయం తెలుసుకోవాలి.