స్వీట్లు తింటేనే డయాబెటీస్ వస్తుందా?
డయాబెటీస్ ఉన్నవారు స్వీట్లను తినకూడదని డాక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచతాయి. అయితే కొంతమంది తీపి ఆహారాలను తింటేనే డయాబెటీస్ వస్తుందని నమ్ముతారు. అసలు ఇది నిజమా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Diabetes
డయాబెటిస్ అనేది నయం చేయలేని వ్యాధి. ప్రస్తుత కాలంలో ఇది సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. అందుకే ఇది నేటి కాలంలో అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారింది. ప్రతిఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
మధుమేహాన్ని నియంత్రించకపోతే ఇది మరెన్నో ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమవుతుంది. అయితే డయాబెటిస్ గురించి జనాల్లో ఒక అపోహ బలంగా ఉంది. అందేంటంటే? స్వీట్లు తినేవారికి డయాబెటిస్ వస్తుందని. చక్కెర ఎక్కువగా తింటే నిజంగా డయాబెటీస్ వస్తుందో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
diabetes
కేవలం స్వీట్లు తింటేనే డయాబెటిస్ వస్తుందా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారికి కేవలం స్వీట్లు తినడం వల్ల మధుమేహం అయితే రాదు. ప్రీడయాబెటిస్ ఉన్నవారు మాత్రం స్వీట్లు తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. ఇలాంటి వారు స్వీట్లను అస్సలు తినకూడదు. ప్రీడయాబెటిస్ ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. సరైన సంరక్షణ, డాక్టర్ సూచనలతో దీన్ని తిప్పికొట్టొచ్చు.
Diabetes
డయాబెటిస్ కు ప్రధాన కారణమేంటి?
డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. నిశ్చల జీవితాన్ని గడిపేవారికి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రాత్రి ఆలస్యంగా పడుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్లే ఈ వ్యాధి వస్తుంది. అలాగే కుటుంబ చరిత్ర ఉన్నవారికి కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. టైప్ 1 డయాబెటీస్ జెనెటిక్స్ వల్ల వస్తుంది. అధిక బరువు ఉన్నవారు కూడా డయాబెటీస్ బారిన పడతారు. అధిక బరువు ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతుంది. అలాగే స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది.