MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Paneer: ఆరోగ్యానికి మంచిదని రోజూ పన్నీర్ తింటున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!

Paneer: ఆరోగ్యానికి మంచిదని రోజూ పన్నీర్ తింటున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!

 Paneer: పాలతో తయారు చేసే పన్నీర్ ని ఇష్టపడని వారు చాలా అరుదు. పెళ్లి, విందు లేదా ఎదైనా శుభకార్యం ఉంది అంటే..కచ్చితంగా పన్నీర్ ఉండాల్సిందే. ఇలాంటి పన్నీర్ అందరూ తినకూడదని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 06 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
paneer
Image Credit : Getty

paneer

పన్నీర్ చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు.. పోషకాలతో నిండి ఉంటుంది. పన్నీర్ లో ఉండే ప్రోటీన్, కాల్షియం శరీరాన్ని బలపరిచి, ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే పన్నీర్ ను శాకాహారులకు ఒక గొప్ప ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. పన్నీర్ లో ప్రోటీన్, కాల్షియం, శారీరక అభివృద్ధికి అవసరమైన అనేక విటమిన్లు ఉంటాయి. ఇది పిల్లల పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి , ఎముకల బలానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలి అనుకునేవారికి, ప్రోటీన్ అవసరం అనుకున్నవారు రోజూ ఈ పన్నీర్ తీసుకుంటూ ఉంటారు. ఈ పన్నీర్ మితంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తి లభించి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాజాగా ఉన్న పన్నీర్ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మేలు చేస్తుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు అందే ఈ పన్నీర్ ని కొందరు పొరపాటున కూడా తినకూడదు. ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పన్నీర్ ఎవరు తినకూడదు..?
Image Credit : Getty

పన్నీర్ ఎవరు తినకూడదు..?

పన్నీర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అది అందరికీ పూర్తిగా సురక్షితం కాదు. కొవ్వు అధికంగా ఉండే పన్నీర్ ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, కడుపు సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు కూడా పన్నీర్ తినడం మంచిది కాదు. అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, గ్యాస్, ఎసిడిటీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి పన్నీర్ తింటే హెవీగా అనిపించొచ్చు. వీరికి ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, దీనివల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు. అలాగే, పాల అలెర్జీ ఉన్నవారు పన్నీర్ పూర్తిగా తినకూడదు. పనీర్ తిన్న తర్వాత మీకు ఏమైనా అసౌకర్యం కలిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

33
పన్నీర్ ఎప్పుడు తినాలి? ఎంత తినాలి?
Image Credit : Getty

పన్నీర్ ఎప్పుడు తినాలి? ఎంత తినాలి?

పన్నీర్ ని ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలి. రోజుకు 50 నుండి 100 గ్రాముల పన్నీర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే, తాజా , నాణ్యమైన పన్నీర్‌ను మాత్రమే తినాలి. రాత్రిపూట దీనిని తినకుండా ఉండటం మంచిది, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి, ఎసిడిటీని పెంచుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Banana: పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?
Recommended image2
Soft Chapati: చపాతీలు మెత్తగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved