పరగడుపున ఈ తులసి, అల్లం నీరు తాగితే ఏమౌతుందో తెలుసా?
తులసిని ఆయుర్వేదం ప్రకారం.. ఔషధాల గనిగా చెబుతుంటారు. అందుకే... వీటిని పొద్దునే పరగడుపున తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే.. మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం ముఖ్యం. ముఖ్యంగా.... ఉదయం చేసే పనులు, తీసుకునే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పరగడుపున తీసుకునే ఆహారాలు.. మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. చాలా మంది ఉదయాన్నే హాట్ వాటర్, లెమన్ వాటర్ లాంటి డీటాక్స్ డ్రింకులు తాగుతారు. అయితే... ఆ వాటర్ కి బదులు మీరు ఈ రోజు నుంచి.. తులసి, అల్లం నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం... ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...
పరగడుపున అల్లం, తులసి నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఔషధ గుణాలు చాలా ఉంటాయి. తులసిని ఆయుర్వేదం ప్రకారం.. ఔషధాల గనిగా చెబుతుంటారు. అందుకే... వీటిని పొద్దునే పరగడుపున తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తులసిలో యాంటీ వైరల్, యాంటీ కొలిస్ట్రాల్ లక్షణాలు ఉంటాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థకు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తులసి, అల్లం నీటిని ఖాళీ కడుపుతో 1 నెల తాగడం వల్ల కూడా మీరు బరువు తగ్గవచ్చు. ఇది పొట్ట కొవ్వును తగ్గిస్తుంది. తులసిలో యూజినాల్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, అల్లంలో ఉండే జింజెరాల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో , అదనపు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడి వ్యాధులు రాకుండా ఉంటాయి. దీంతో నోటి దుర్వాసన తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
ఈ పానీయం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఈ డ్రింక్‌ని ఒక నెలపాటు తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
ఈ నీటిని ఎలా తీసుకోవాలంటే...
మంచిగా, శుభ్రంగా ఉన్న 4-5 తులసి ఆకులను తీసుకోండి. అర అంగుళం అల్లం ముక్క తీసుకోండి. ఇప్పుడు 1 గ్లాసు నీటిలో వేసి మరిగించాలి.
సగం మిగిలిపోయాక వడగట్టి తాగాలి. మీరు ఖాళీ కడుపుతో త్రాగాలి. నెల రోజులు తాగితే.. తేడా స్పష్టంగా మీకే కనపడుతుంది.