ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టకూడదో తెలుసా?
పిల్లలు శారీరకంగా, మానసికంగా మంచిగా ఎదగాలంటే.. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం…
kids eating
ఈ రోజుల్లో పిల్లలను పెంచడం పెద్ద సవాలు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం అందించడం చాలా కష్టం. మనం పౌష్టికాహారం తినిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు.దాని వల్ల ఎదుగుదల సరిగా ఉండగ, ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. మరి, పిల్లలు శారీరకంగా, మానసికంగా మంచిగా ఎదగాలంటే.. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం…
kids eating
ఐదేళ్ల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఆహారాలు ఇవే…
తేనె:
తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల శరీరానికి మంచి శక్తి నడుస్తుంది. జీర్ణ వ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. కానీ పిల్లలకు ఈ తేనె ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే.. వీరికి దీనిని ఎక్కువ క్వాంటిటీలో పెట్టడం వల్ల అజీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఐదేళ్ల లోపు పిల్లలకు తేనె పెట్టకూడదు. పెట్టినా.. చాలా తక్కువ సమయంలో ఇవ్వడం మంచిది.
kids eating
కూలడ్రింక్స్…
పిల్లలు తమ తల్లిదండ్రులతో బయటకు వెళ్లినప్పుడల్లా కూల్ డ్రింక్స్ కొనిపెట్టమని ఏడుస్తూ ఉంటారు. కానీ.. వారు ఎంత ఏడ్చినా కూడా ఐదేళ్ల లోపు పిల్లలకు కొనివ్వకూడదు. ఎందుకంటే.. వాటిలో చక్కెర ,కెఫిన్ చాలా ఉన్నాయి, ఇది ఊబకాయం, గ్యాస్ ,జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
నట్స్..
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలను ఎక్కువగా తినకూడదు ఎందుకంటే వారు వాటిని సరిగ్గా నమలలేరు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వాంతులు ,విరేచనాలు వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.
మసాలా ఆహారాలు:
చిప్స్ ,పాప్స్ వంటి స్పైసీ స్నాక్స్ పిల్లలు ఇష్టపడతారు. కానీ వాటిని పిల్లలకు ఇవ్వకూడదు. అవి పిల్లలకు కడుపునొప్పి ,అజీర్ణానికి కారణమవుతాయి.
పాప్‌కార్న్:
పిల్లలు ఇష్టపడి తినే స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటి. కరకరలాడుతూ ఉండడంతో పిల్లలు సరిగ్గా నమలకుండానే ఎక్కువగా తింటారు. అందులో ఉండే చిన్న చిన్న రేణువులు వారి నోట్లో కూరుకుపోయి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది.
ఆహారాలు
ఇది కాకుండా, పండ్ల రసం, ఉడకని మాంసాలు వంటి అనేక ఆహారాలకు దూరంగా ఉండటం కూడా మంచిది. పిల్లలకు ఆహారం ఇచ్చినా.. మొదట్లో కొద్దిగా ఇస్తే బాగుంటుంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ విషయాలను పాటించాలి.