ఆవు.. గేదె.. మీ ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?
మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు పొందుగా ఉండే ఆహారం తీసుకోవాలి. మరీ ముఖ్యంగా శరీర ఎముకలు పుష్టిగా ఉండాలంటే పాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి మీ ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? లేక గేదే పాలు పంచివా?
Milk
ఆవు పాలలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఒక గ్లాస్ ఆవు పాలలో 305 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ పాలు ఎముక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఎముకలు బలంగా ఉండటానికి పాలు చాలా మంచివి. పాలలో కాల్షియంతో పాటుగా ప్రోటీన్, విటమిన్ , విటమిన్ డి లు కూడా మెండుగా ఉంటాయి.
Milk
ఏ జంతు పాలలో ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉంటుంది? అనే దానికి వైద్యనిపుణులు చెబుతున్న సమాధానాలు గమనిస్తే.. ఆవు పాల కంటే గేదె పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎముకలు బలంగా ఉండాలంటే గేదె పాలు తాగాలి. ఇవి పోషకమైనవి అలాగే, వివిధ రకాల ఎముకల సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. అందుకే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే గేదె పాలను తాగండి.
కాల్షియం మన ఎముక సాంద్రతను పెంచుతుంది. ఎముకలను లోపలి నుంచి బలంగా చేస్తుంది. ఇది ఎన్నో ఎముక సంబంధిత సమస్యలను నివారించడంలో పాటుగా సహాయపడతాయి. ఉదాహరణకు కీళ్ల నొప్పులను తగ్గించడానికి పాలు బాగా ఉపయోగపడతాయి.
పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా మారి ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆవు పాలు లేదా గేదె పాలలో ఏవి మీకు మంచివి అనే ప్రశ్న వచ్చే ఉంటుంది. పాలు తాగడం వల్ల ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి ఏ పాలలో ఎక్కువ కాల్షియం ఉంటే అవి తాగడం మంచిది.
గేదె పాలలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. 250 మిల్లీ లీటర్ల గేదె పాలు 412 మిల్లి గ్రాముల కాల్షియంను అందిస్తాయి. ఇందులో ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరైడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఇందులోని కొవ్వు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.