MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • ఆవు పాలు వర్సెస్ గేదె పాలు.. ఇవి తాగితేనే మంచిది

ఆవు పాలు వర్సెస్ గేదె పాలు.. ఇవి తాగితేనే మంచిది

కొంతమంది ఆవుపాలు తాగితే మరికొంతమంది గేదె పాలను తాగుతుంటారు. మరి ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Aug 30 2025, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆవు పాలు, గేదె పాలు
Image Credit : stockPhoto

ఆవు పాలు, గేదె పాలు

పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతున్నారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మనలో కొంతమంది ఆవు పాలను తాగితే, మరికొంతమంది మాత్రం గేదె పాలను తాగుతుంటారు.

 నిజానికి ఈ రెండు రకాల పాలు మంచివే. కానీ వీటిలోని పోషకాలు, టేస్ట్, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆవు పాలు
Image Credit : Getty

ఆవు పాలు

 చాలా మంది ఆవుపాలనే తాగుతుంటారు. అయితే ఈ ఆవు పాలలో ప్రోటీన్లు, కొవ్వుపుష్కలంగా ఉంటాయి. ఈ పాలు సులువుగా జీర్ణం అవుతాయి. అయినా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్నవారు మాత్రం ఆవు పాలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి ఈ సమస్యలను పెంచుతాయి. అయితే ఆవు పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. ఈ పాలు కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. 

Related Articles

Related image1
ఇలా చేస్తే కిచెన్ టైల్స్‌ పై నూనె మరకలు లేకుండా పోతాయ్
Related image2
పాలలో ఇదొక్కటి కలుపుకుని తాగితే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది
34
గేదె పాలు
Image Credit : Getty

గేదె పాలు

గేదె పాలలో ఆవు పాలకంటే ఎక్కువ మొత్తంలో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. అందుకే ఈ పాలు జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. గేదె పాలలోని ప్రోటీన్లు మనకు శక్తిని ఎక్కువగా ఇస్తాయి. కానీ వీటిలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మాత్రం శరీరంలో పేరుకుపోతుంది. 

ఒకేదగ్గర కూర్చొనే వారు ఈ పాలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలోని ఫ్యాట్ బరువు పెరిగేలా చేస్తుంది. ఈ పాలను శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు తాగితే మంచిది. ఆవు పాల లాగే జీర్ణ సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలున్నవారు గేదె పాలను తాగకూడదు. తాగితే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

44
ఏ పాలు మంచివి?
Image Credit : Getty

ఏ పాలు మంచివి?

- గేదె పాల విషయానికి వస్తే వీటిలో ప్రోటీన్ అవసరానికి మించి ఉంటుంది. కాబట్టి ఈ పాలను తాగితే మూత్రపిండాలపై అదనపు భారం పడుతుంది. ఆవు పాలు ఇలా కాదు. వీటిలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాలకు ఎలాంటి హాని చేయవు. కాబట్టి మూత్రపిండాల సమస్య ఉన్నవారు గేదె పాలను కాకుండా ఆవు పాలను తాగాలి. 

- ఇకపోతే ఆవు పాలు తొందరగా అరుగుతాయి. కాబట్టి వీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు రావు. కానీ కొన్ని కొన్ని సార్లు గ్యాస్, కడుపు ఉబ్బరం, వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇది చాలా రేర్ గా జరుగుతుంది. అదే గేదె పాలు అయితే అరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ పాలను పిల్లలు,  వృద్ధులు తాగితే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే జీర్ణ సమస్యలు లేనివారే గేదె పాలను తాగాలి. 

మొత్తంగా ఈ రెండింటిలో మనకు మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీ శరీర అవసరాలను తెలుసుకుని ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని తాగడం మంచిది. అయితే గేదె పాలలో నీళ్లు కలిపి మరిగించి తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పాలు పలచడి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
ఇలా చేస్తే కిచెన్ టైల్స్‌ పై నూనె మరకలు లేకుండా పోతాయ్
Recommended image2
పాలలో ఇదొక్కటి కలుపుకుని తాగితే రాత్రిపూట బాగా నిద్రపడుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved