శరీరంలో కొవ్వును కరిగించే సూపర్ కాఫీలు ఇవి...!
ఈ కాఫీతో మనం మన శరీరంలోని కొవ్వును కరిగించవచ్చట. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును కరిగించడానికి కాఫీ ఉపయోగపడుతుందట. మరి ఆ కాఫీలు ఏంటో ఓసారి చూద్దాం....
Image: Getty Images
మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగగానే.. మనకు ఉత్సాహం వచ్చేస్తుంది. బద్దకం మొత్తం వదిలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే... ఈ కాఫీతో మనం మన శరీరంలోని కొవ్వును కరిగించవచ్చట. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును కరిగించడానికి కాఫీ ఉపయోగపడుతుందట. మరి ఆ కాఫీలు ఏంటో ఓసారి చూద్దాం....
1. దాల్చిన చెక్క అల్లం కాఫీ
దాల్చిన చెక్క, అల్లం తో కలిపి తయారు చేసిన కాఫీ శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందట. దీని కోసం ముందుగా... మనం అల్లం పొడి ని తీసుకోవాలి. ఆ తర్వాత అందులో.... దాల్చిన చెక్క పొడిని కూడా కలపాలి. ఈ మిశ్రమంలో.... కాఫీ పొడి, ఆ తర్వాత కమ్మని పాలు కలపాలి. తీపి కోసం తేనె కలపాలి. ఈ కాఫీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు... నడుము దగ్గర కొవ్వు కరిగించడంలో ఎక్కువగా సహాయం చేస్తుంది. దీనిలో కావాలంటే వెనీలా ఎసెన్స్, జాజికాయ పొడి కూడా కలుపుకోవచ్చు.
coffee cup
2.మసాలా మోచా
ముందుగా ఒక కప్పులో...పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, మిరియాల పొడి వేసి అందులోనే కాఫీ పొడిని కూడా కలపాలి. దీనిలో బాగా మరిగించిన పాలు పోసి బాగా కలపాలి. దీనిలో చివరగా వెనీలా ఎసెన్స్ కూడా కలపాలి. ఇప్పుడు... వేడిగా ఉన్న పాలు.. నురుగుతో సహా జోడించాలి. అంతే.... ఈ కాఫీ కూడా ... మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
3. పిస్తా మకియాటో
ఈ కాఫీ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పులో పిస్తా, పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వత అందులో...ఒక వెచ్చని షాట్ ఎస్ప్రెస్సో పోసి బాగా కలపండి. ఇప్పుడు అందులో తక్కువ కొవ్వు ఉన్న పాలు నురుగును జోడించండి. ఆ తర్వాత అందులో చిటికెడు యాలకుల పొడి, పిస్తాతో అలంకరించండి.