Chicken vs Mutton : హలీమ్ ఏది తినడం బెస్ట్..?
కేవలం ఈ మాసంలో మాత్రమే హలీమ్ దొరుకుతుంది కాబట్టి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే..హలీమ్ ఎక్కడ అమ్మితే అక్కడ క్యూలు కట్టేస్తూ ఉంటారు.

haleem
రంజాన్ అనగానే ఎక్కువ మందికి ముందు గుర్తుకు వచ్చేది హలీమ్. నిజానికి ఈ పవిత్రమైన రంజాన్ మాసం ముస్లింలకు సంబంధించినది అయినా.. ముస్లిమేతరులు కూడా దీని కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే.. కేవలం ఈ మాసంలో మాత్రమే హలీమ్ దొరుకుతుంది కాబట్టి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే..హలీమ్ ఎక్కడ అమ్మితే అక్కడ క్యూలు కట్టేస్తూ ఉంటారు.
haleem
ప్రజల అభిరుచి మేరకు ఈ మధ్యకాలంలో హలీమ్ కేంద్రాల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని చెప్పాలి. ప్యూర్ నెయ్యి , కాశ్మీరీ మసాలా వంటి క్యాప్షన్లతో ప్రత్యేకమైన చికెన్, మటన్ హలీమ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువగా మటన్ హలీమ్ కి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఖరీదు కూడూ కాస్త ఎక్కువ అనే చెప్పొచ్చు. మరి, ఈ చికెన్ హలీమ్, మటన్ హలీమ్ ఈ రెండింటిలో ఏది తినడం బెస్ట్ అనే విషయం ఇప్పుడు చూద్దాం...
hyderabadi haleem
చికెన్ హలీమ్ vs మటన్ హలీమ్ – ఏది మంచిది?
ఇవి రెండూ రుచికరమైన వంటకాలు, అయితే మీ ఆరోగ్య పరిస్థితి, రుచిప్రాధాన్యత, పోషక విలువల ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.
పోషక విలువల పరంగా
మటన్ హలీమ్: ప్రోటీన్ ఎక్కువగా ఉండే మటన్ హలీమ్ ఐరన్, విటమిన్ B12, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. అయితే, ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
చికెన్ హలీమ్: మటన్‌తో పోలిస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి, తేలికగా జీర్ణమవుతుంది.
hyderabadi haleem
ఆరోగ్య పరంగా
హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి .. చికెన్ హలీమ్ మంచిది, ఎందుకంటే ఇందులో కొవ్వు తక్కువ.
బలహీనత, రక్తహీనత (అనీమియా) ఉన్నవారికి.. మటన్ హలీమ్ మంచిది, ఎందుకంటే ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది.
తీవ్రమైన ఫిట్‌నెస్ ఫోకస్ ఉన్నవారికి.. చికెన్ హలీమ్ బెటర్, ఎందుకంటే ఇందులో లీన్ ప్రోటీన్ ఎక్కువ.
శక్తి ఎక్కువగా కావాలనుకునేవారికి.. మటన్ హలీమ్ మంచిది, ఎందుకంటే ఇది శరీరానికి ఎక్కువ కాలం శక్తినిస్తుంది.
రుచి పరంగా
మటన్ హలీమ్.. మటన్ మాంసం సహజంగా ఎక్కువ రుచికరంగా ఉండటంతో దీని టెక్చర్, సువాసన బలంగా ఉంటుంది.
చికెన్ హలీమ్.. మృదువైన మాంసంతో తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది, కానీ రుచిలో కొంత తేలికగా ఉంటుంది.