యమ్మీ చికెన్ దోశ.. తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే..
మీరు దోశ ప్రియులా? మామూలుగా చట్నీతో తినే దోశకంటే ఏదైనా స్టఫ్ చేసిన దోశలంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీ కోసమే.. చక్కటి ప్రోటీన్ తో కూడిన టేస్టీ టేస్టీ చికెన్ దోశ..
మీరు దోశ ప్రియులా? మామూలుగా చట్నీతో తినే దోశకంటే ఏదైనా స్టఫ్ చేసిన దోశలంటే ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీ కోసమే.. చక్కటి ప్రోటీన్ తో కూడిన టేస్టీ టేస్టీ చికెన్ దోశ..
చికెన్ కీమాతో పాటు ఉల్లిపాయలు, టమోటాలు, మసాలాలతో ఘుమఘుమలాడుతూ.. నోట్లో నీళ్లూరించే ఈ చికెన్ దోశ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలోనైనా ఎంచక్కా లాగించేయచ్చు.
దీన్ని కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి లేదా సాంబార్‌తో తింటే ఆహా.. ఆ రుచే అద్భుతం..
చికెన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
400 గ్రాముల సన్నగా తరిగిన చికెన్
2 మీడియం సైజు ఉల్లిపాయలు
1 టీస్పూన్ కారం పొడి
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ అల్లం పేస్ట్
2 టేబుల్ స్పూన్ల వెజిటెబుల్ ఆయిల్
అవసరానికి తగినంత దోశపిండి
2 కరివేపాకు రెబ్బలు
1/2 కప్పు టమోటా ప్యూరీ
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ గరం మసాలా పొడి
1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
రుచికి తగినంత ఉప్పు
3/4 కప్పు నీళ్లు
చికెన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
400 గ్రాముల సన్నగా తరిగిన చికెన్
2 మీడియం సైజు ఉల్లిపాయలు
1 టీస్పూన్ కారం పొడి
1/2 టీస్పూన్ నల్ల మిరియాలు
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ అల్లం పేస్ట్
2 టేబుల్ స్పూన్ల వెజిటెబుల్ ఆయిల్
అవసరానికి తగినంత దోశపిండి
2 కరివేపాకు రెబ్బలు
1/2 కప్పు టమోటా ప్యూరీ
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ గరం మసాలా పొడి
1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
రుచికి తగినంత ఉప్పు
3/4 కప్పు నీళ్లు
చికెన్ దోశ తయారు చేసే విధానం :
ముందుగా చికెన్ దోశకు కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక నిమిషంపాటు వేగనివ్వాలి.
ఆ తరువాత దీంట్లో ఉల్లిపాయలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు టమోటా ప్యూరీ, కారం, పసుపు, నల్ల మిరియాలు పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి 3-4 నిమిషాల పాటు వేగనివ్వాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన చికెన్‌ను కుక్కర్‌లో వేసి మసాలాతో బాగా కలపాలి. దీనికి 3/4 కప్పు నీళ్లు వేసి బాగా కలిపి మూత మూసిపెట్టి, 8-10 నిమిషాలు ఉడికించాలి.
ఆ తరువాత, మూతతీసి చూడాలి. నీరు పూర్తిగా ఇగిరిపోయి కూర దగ్గరికి రావాలి. తరువాత దీనిమీద కొత్తిమీర వేసి స్టఫ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఒక పెనం వేడిచేసి, దీనిమీద దోశవేసి రెండు వైపుల కాల్చాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసిపెట్టుకున్న చికెన్ మసాలను 2-3 టేబుల్ స్పూన్లు దోశమీద వేసి.. దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ దోశ రెడీ.
ఈ దోశను కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డిస్తే.. ఆవురావురుమంటూ లాగించేస్తారు. ట్రై చేయండి.