ఖర్జూరాల్లో కూడా పురుగులుంటాయ్.. తినేముందు ఇలా చెక్ చేయండి
ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని చాలా మంది రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని తినేముందు ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే వీటిలో కూడా పురుగులు ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలియక అలాగే తినేస్తుంటారు.

ఖర్జూరాల్లో పురుగులు
ఖర్జూరాలు మంచి హెల్తీ ఫుడ్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన ఖనిజాలుంటాయి. దీన్ని తింటే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఇవి బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.అందుకే రోజుకు రెండు ఖర్జూరాలను తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు.
ఖర్జూరాల ప్రయోజనాలు
ఖర్జూరాల్లో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ ఉంటుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది అంతేకాదు ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటివల్ల ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఖర్జూరాల్లో పురుగులు
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఖర్జూరాలను తింటే కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిలో కూడా పురుగులు ఉంటాయి. ఈ పురుగులున్న ఖర్జూరాలను తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఖర్జూరాలను తినే ముందు దాన్ని రెండు ముక్కలుగా చేసి లోపల పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేయండి. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలకు దూరంగా ఉండగలుగుతారు.
ఖర్జూరాల్లో పురుగులు
ఖర్జూరాల్లో పురుగులను ఎలా గుర్తించాలి : మీరు తినే ఖర్జూరాల చుట్టూ, లోపల తెలుపు, నలుపు లేదా బూడిద, ఆకుపచ్చ రంగులో మచ్చలు ఉంటే అస్సలు తినకండి. అలాగే ఖర్జూరాల్లో దుర్వాసన వచ్చినా కూడా తినకండి. ఇవి పుల్లని వాసన వస్తే పాడైపోయాయని అర్థం చేసుకోండి.
ఖర్జూరాల్లో పురుగులు
ఖర్జూరాల్లో పురుగులు ఎందుకు ఏర్పడతాయి? ఖర్జూరాల్లో పురుగులు ఏర్పడటానికి ప్రధాన కారణం తేమ, చక్కెర.
ఖర్జూరాల్లో పురుగులు
పురుగులు ఉన్న ఖర్జూరాలను తినడం వల్ల వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.