MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రాత్రిపూట అన్నం తినాలా? చపాతీ తినాలా? ఏది తింటే మంచిదో తెలుసా?

రాత్రిపూట అన్నం తినాలా? చపాతీ తినాలా? ఏది తింటే మంచిదో తెలుసా?

డిన్నర్ లో హెల్తీ ఫుడ్ ను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. అయితే కొంతమంది రాత్రిపూట చపాతీ తింటే, మరికొంతమంది చపాతీ తింటుంటారు. కానీ డిన్నర్ లో ఏది తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 20 2024, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
chapati rice

chapati rice

మనం తినే ఫుడ్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే మంచి హెల్తీ ఫుడ్ ను తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. అయితే చాలా మంది డిన్నర్ లో అన్నం తింటే, మరికొంతమంది చపాతీలను తింటుంటారు. కానీ డిన్నర్ లో చపాతీ తినడం మంచిదా? అన్నం తినడం మంచిదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిజానికి అన్నం, చపాతీ మన రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ రెండింటిని మనం ప్రతిరోజూ తింటుంటాం. కానీ పోషకాల పరంగా ఈ రెండింటిలో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి డిన్నర్ లో అన్నం తింటే మంచిదా? చపాతీ తింటే మంచిదా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చపాతీ, అన్నం మధ్య పోషకాల్లో తేడా ఏంటి? 

చపాతీ: చపాతీని గోధుమ పిండితో తయారుచేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే చపాతీలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్-బి కాంప్లెక్స్, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గోధుమ పిండిలో ఫైబర్, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

36

అన్నం:  వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, విటమిన్-బి కాంప్లెక్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.  అయితే బియ్యం తెలుపు, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. కానీ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లోనే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 
 

46

చపాతీ, అన్నం ఆరోగ్య ప్రయోజనాలు

చపాతీ ప్రయోజనాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: చపాతీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

బరువు నియంత్రణ:  చపాతీలో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. చపాతీని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యం: గోధుమ చపాతీలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

56

బ్రౌన్ రైస్

శక్తి వనరు - బ్రౌన్ రైస్ లో మన శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. 

కండరాల నిర్మాణం: అన్నంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను నిర్మించడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: బ్రౌన్ రైస్ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 
 

66

చపాతీ లేదా అన్నం.. రెండింటిలో ఏది మంచిది? 

నిజం చెప్పాలంటే అన్నం, చపాతీలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పడం కొంచెం కష్టమే.  ఎందుకంటే అన్నం, చపాతీ రెండూ స్వంత ప్రయోజనాలను, నష్టాలను కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలో మీరు ఏది తినాలనేది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, అవసరాలపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే గోధుమ చపాతీ లేదా బ్రౌన్ రైస్ ను తినాలి. 

మీకు డయాబెటీస్ ఉంటే గనుక వైట్ రైస్ ను తినడం మానేయాలి. ఎందుకంటే వీటిలో ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఆహారాలను తినాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image2
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image3
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved