ఉడికించిన గుడ్డు Vs ఆమ్లేట్... రెండింటిలో ఏది బెటర్?
ఉడికించిన కోడిగుడ్డు, ఆమ్లేట్ రెండూ మంచి పోషకాహారాలే. కానీ, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా? ఏది రోజూ తినడం మంచిదో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
కోడిగుడ్డు ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ గుడ్డు తినడానికి ఆసక్తి చూపిస్తారు. గుడ్డు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక్క గుడ్డు అయినా తినాలి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో గుడ్డు తినడం చాలా అవసరం. అందుకే.. ఈ సీజన్ లో గుడ్ల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
గుడ్డును ఎక్కువగా ఉడికించి లేదంటే.. ఆమ్లేట్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. కానీ, ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా? ఏది తింటే ఎక్కువ లాభ ం కలుగుతుందో తెలుసా? పోషకాల విషయంలో ఈ రెండింటిలో ఉన్న తేడా ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
1.కొవ్వు, కేలరీలు
ఉడికించిన గుడ్డు: ఉడికించిన గుడ్డులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్ల భాగంలో కొవ్వు తక్కువ. తక్కువ కొవ్వుతో పాటు కేలరీలు కూడా తక్కువ. బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు తెల్లసొన తింటారు.
ఆమ్లెట్: ఆమ్లెట్ వేయడానికి నూనె వాడటం వల్ల దానిలో కొవ్వు, కేలరీలు పెరుగుతాయి. ఎక్కువ నూనె వాడితే ఆమ్లెట్‌లో కొవ్వు ఎక్కువవుతుంది.
2.ప్రోటీన్
ఉడికించిన గుడ్డు: గుడ్డు ప్రోటీన్ మూలం, తెల్లసొనలో ఈ అంశం ఎక్కువ. ప్రోటీన్ తక్కువగా ఉన్నవారికి గుడ్డు తెల్లసొన తినమని సలహా ఇస్తారు.
ఆమ్లెట్: ఆమ్లెట్‌లో పచ్చసొన, తెల్లసొన ఉంటాయి. కాబట్టి ఆమ్లెట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
3.విటమిన్లు, ఖనిజాలు
ఉడికించిన గుడ్డు: విటమిన్ ఎ, బి12తో పాటు ఉడికించిన గుడ్డులో ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఆమ్లెట్: ఆమ్లెట్ వేయించడం వల్ల గుడ్డులోని విటమిన్లు, ఖనిజాలు తగ్గవచ్చు. ఆమ్లెట్‌లో టమాటా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వంటి కూరకాయలు, మసాలాలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
4.జీర్ణక్రియ
ఉడికించిన గుడ్డు: అదనపు కొవ్వు లేకపోవడంతో ఉడికించిన గుడ్డు జీర్ణక్రియకు అంతరాయం కలిగించదు. ఉడికించిన గుడ్డు త్వరగా జీర్ణమవుతుంది.
ఆమ్లెట్: దీన్ని వేయడానికి ఎక్కువ నూనె, మసాలాలు వాడతారు. కాబట్టి జీర్ణం కావడానికి సమయం పడుతుంది.
5.ఆరోగ్యంపై ప్రభావం
ఉడికించిన గుడ్డు: ఉడికించిన గుడ్డులో సంతృప్త కొవ్వు తక్కువ కాబట్టి రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.
ఆమ్లెట్: తక్కువ నూనె, మసాలాతో ఆమ్లెట్ వేయొచ్చు. కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఆమ్లెట్ తింటే బరువు పెరగొచ్చు.