నాన్ వెజ్ ముట్టని వారికి ది బెస్ట్ ఫ్రోటీన్ ఫుడ్స్ ఇవే..!
పప్పు, తృణ ధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్ తో పాటు.. విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్, జింక్, అమినో యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి.
ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్ ఏది...? ఈ మాట వినగానే అందరూ కోడి గుడ్డు,చికెన్ లాంటివి చెబుతుంటారు. నాన్ వెజ్ తినేవారికి ఇవి తీసుకుంటే.. మనిషికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రోటీన్ అవసరం. మరి ఆ ప్రోటీన్ నాన్ వెజ్్ తినేవారికి సులభంగానే అందుతుంది. మరి నాన్ వెజ్ తినని వారి మాటేంటి..? కేవలం నాన్ వెజ్ మాత్రేమ కాదు.. చాలా మంది డెయిరీ ప్రోడక్ట్ట్స్ తినడానికి కూడా ఇష్టపడరు. మరి అలాంటి వారికి ప్రోటీన్ ఎలా అందుతుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే... వెజ్ లోనూ చాలా రకాల ఫుడ్స్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
పప్పు, తృణ ధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్ తో పాటు.. విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్, జింక్, అమినో యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి.
ఒక కప్పు కినోవా లో 8 గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేవలం ప్రోటీన్, ఫైబర్ మాత్రమే కాకుండా... కినోవాలో.. మజిల్ స్ట్రెంత్ ని పెంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా సహాయం చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ప్రోటీన్ కి మరో సోర్స్ నట్స్. బాదం పప్పు, వాల్ నట్స్, పిస్తా ల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఫ్యాట్స్, ఫైబర్, ఇతర విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.
మరో ప్రోటీన్ సోర్స్ గా గింజలను చెప్పవచ్చు. చియా సీడ్స్, అవిసె గింజలల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియ్స్ ఈ ఫుడ్స్ ని.. కచ్చితంగా తమ డైట్ లో భాగం చేసుకోవాలి.
సోయా బీన్స్ లో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కొలిస్ట్రాల్ ఫ్యాట్ కూడా తక్కువగా ఉంుటంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల... గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఓట్స్... చాలా మంది బరువు తగ్గాలి అనుకునేవారు ఓట్స్ ని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే..ఈ ఓట్స్ లో సైతం ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.