చలికాలంలో వేడి వేడి సూప్ తాగితే ఎన్ని లాభాలున్నాయా..!
చలికాలంలో వేడివేడిగానే తినాలనిపిస్తుంది. తాగాలనిపిస్తుంది. అయితే ఈ సీజన్ లో చాలా మంది చలిని తట్టుకోవడానికి ఎన్నో రకాల ఆహారాలను తింటుంటారు. కాగా ఈ సీజన్ లో వేడి వేడి సూప్ ను తాగితే శరీరం వెచ్చగా ఉండటంతో పాటుగా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
soup
మంచి పోషకాలు
వేడి వేడి సూప్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూప్ మనకు మంచి పోషణను అందిస్తుంది. రకరకాల కూరగాయలతో లేదా చికెన్ సూప్ ను కూడా ఈ సీజన్ లో ఎంచక్కా తాగొచ్చు. దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే మన కడుపును తొందరగా నింపుతాయి. దీంతో మీరు అతిగా తినలేరు. అలాగే ఈ సీజన్ లో ఆరోగ్యంగా కూడా ఉంటారు.
soup
హైడ్రేషన్
చలికాలంలో నీళ్లను అస్సలు తాగాలనిపించదు. ముందే వెదర్ చల్లగా ఉండటంతో చల్లగా ఉండే నీళ్లను తాగితే మరింత చలి పెడుతుందని చాలా మంది నీళ్లను తాగనే తాగరు. కానీ దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తుంది. అయితే ఈ సీజన్ లో మీరు సూప్ లు వంటి ద్రవాలు ఎక్కువగా ఉండే వాటిని తాగినా, ఫుడ్స్ ను తీసుకున్నా మీ శరీరానికి కావాల్సిన ద్రవాలు అందుతాయి. దీంతో మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. ఇవి చలికాలంలో మీ శరీరాలను వెచ్చగా ఉంచుతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. దీంతో మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
soup
రోగనిరోధక శక్తి
ఏ సీజన్ లో అయినా సరే సీజనల్ పండ్లను, కూరగాయలను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. సూప్ లల్లో వెల్లుల్లి, అల్లం, తీరొక్క రకాల కూరగాయలను వేస్తుంటారు. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. చలికాలంలో అనారోగ్యం బారిన పడే ప్రమాదాన్ని ఈ సూప్ లో ఉండే పోషకాలు తగ్గిస్తాయి.
soup
శక్తివంతంగా
ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మనం ఏదో ఒకటి తింటుంటాం. ఇలాంటి సమయంలో సూప్ లను తాగడం ఉత్తమం. ఎందుకంటే సూప్ లల్లో కూరగాయలు, ప్రోటీన్లు, ధాన్యాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపును నింపుతాయి. అలాగే ఆకలి అతిగా కాకుండా చేస్తాయి. అలాగే ఇవి మనల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి.
soup
బరువు నిర్వహణ
చలికాలంలోనే విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్ లో వేడి వేడి బజ్జీలు, సమోసాలు, పకోడి వంటి అన్నీ ఆయిల్ ఫుడ్స్ నే ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. ఈ సీజన్ లో మీరు బరువు తగ్గడానికి సూప్ లు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తాగితే మీ ఆకలి నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ సూప్ లో మీరు తీసుకునే కేలరీలను తగ్గిస్తుంది. అలాగే తొందరగా కడుపు నింపుతుంది. ఈ సూప్ లతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.