MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటిలో బోలెడు లాభాలు దాగున్నాయి మరి

నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటిలో బోలెడు లాభాలు దాగున్నాయి మరి

నువ్వులు చూడటానికి చిన్నగా ఉన్నా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు ప్లాస్మా, గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 13 2023, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిన్నగా ఉంటాయి.. ఇవి మనకెలా సహాయపడతాయని నువ్వులను తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మన  శరీరానికి అవసరమయ్యే పోషకాలెన్నో నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులలో లిగ్నన్ లు, ఫైటోస్టెరాల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి  శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను  తగ్గించడానికి సహాయపడతాయి. నువ్వుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండే నువ్వులు దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. నువ్వులు మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

36

నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లాస్మా,  మరియు గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

46

మూడు టేబుల్ స్పూన్లు అంటే 30 గ్రాముల  నువ్వులలో 3.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. అంతేకాదు గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఫైబర్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
 

56

కొన్ని అధ్యయనాలు నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. నువ్వులలో 15% సంతృప్త కొవ్వు, 41% పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు, 39% మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. 

66

సంతృప్త కొవ్వుల కంటే ఎక్కువ పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ కు ప్రధాన ప్రమాద కారకం. నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved