చలికాలంలో ఉల్లిగడ్డ తింటే ఏమౌతుందో తెలుసా?
ఉల్లిపాయల్ని మనం కాలాలతో సంబంధం లేకుండా ప్రతికూరలో వేసుకుని తింటుంటాం. అయితే ఈ చలికాలంలో ఉల్లిగడ్డను తింటే ఏమౌతుందో తెలుసా?.

onion
వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఉల్లిపాయలు మాత్రం ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రతి కూరలో ఉల్లిపాయల్ని వేస్తుంటాం. ఉల్లిపాయలు కూరల్ని టేస్టీగా చేస్తాయి. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని చలికాలంలో తినొచ్చా? లేదా? అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తుంటుంది. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అది కూరైనా, సలాడ్ అయినా.. ఉల్లిపాయను ఎన్నో విధాలుగా మన రోజువారి ఆహారంలో ఉపయోగిస్తుంటాం. చలికాలంలో ఈ కూరగాయలు తినొద్దు, వానాకాలంలో ఆ కూరగాయలు తినొద్దు, ఎండాకాలంలో ఆ కూరగాయలు తినొద్దని చెప్తుంటారు. కానీ ఉల్లిపాయల్ని మాత్రం ఏ సీజన్ లో తినకూడదు అన్న ముచ్చట ఉండదు. అందుకే ఈ కూరగాయను సీజన్ తో సంబంధం లేకుండా ఉపయోగిస్తుంటాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉల్లిపాయల్ని ఏ సీజన్ లో అయినా తినొచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఉల్లిపాయల్ని తినడం వల్ల మనం బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
onion
జలుబు, దగ్గు, గొంతునొప్పి నుంచి ఉపశమనం
చలికాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో చాలా మందికి ఈ సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీ రోజువారి ఆహారంలో ఉల్లిపాయల్ని చేర్చడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు.
ముఖ్యంగా ఈ చలికాలపు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలు తగ్గడానికి ఉల్లిరసం ఒక ఎఫెక్టీవ్ హోం రెమెడీ తెలుసా? ఇది చికాకును నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దీనిలో ఉండే సల్ఫ్యూరిక్ సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగుంటుంది. ఇవి చలికాలంలో మనల్ని ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. ఇందుకోసం ఉల్లిరసం బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే ఉల్లిపాయల్లో మన రోగనిరోధక శక్తిని బలంగా చేసే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని చలికాలంలో ఎన్నో వైరస్లు, సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తాయి. అందుకే ఈ చలికాలంలో మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటే మన రోజువారి ఆహారంలో ఖచ్చితంగా ఉల్లిపాయల్ని చేర్చుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధుల నివారణ
చలికాలంలో గ్రీన్ ఉల్లిపాయలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే ఉల్లిపాయలు మిమ్మల్ని చల్లని గాలుల నుంచి కూడా కాపాడుతాయి. దీంతో మనం అనారోగ్యానికి గురికాకుండా ఉంటాం.
ఉల్లిపాయల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు
చలికాలంలో మన రోజువారి ఆహారంలో ఉల్లిపాయల్ని చేర్చడానికి ముఖ్యమైన కారణం వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటమే. ఈ సీజన్లో మన చర్మం చాలా ఫాస్ట్ గా పొడిబారుతుంది. దీంతో నిర్జీవంగా కనిపిస్తుంది.
అలాగే ఎన్నో కారణాల వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు వంటి అకాల వృద్ధాప్య సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గనుక ఈ సీజన్లో ఉల్లిపాయలను తింటే ముడతలు, సన్నని గీతలతో సహా వృద్ధాప్య ప్రారంభ సంకేతాలు రాకుండా ఉంటాయి. వచ్చినా తగ్గిపోతాయి.