పనస తొనలు రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?
నార్మల్ గా పండులానే తినొచ్చు.. లేదంటే... చాలా రకాల వంటలు కూడా దీనితో తయారు చేస్తారు. మరి దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కడ చూసినా పసన కాయలు విరివిగా దొరుకుతూ ఉంటాయి. చాలా మందికి ఈ పసన తొనల వాసనకే కడుపు నిండిపోతుంది. పండిన పసనకాయ వాసన చాలా కమ్మగా ఉంటుంది. దీనిని కోయడం కష్టం అని చాలా మంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ.. ఈ పసనసకాయ పండిన తర్వాత.. దాని తొనలను రోజూ కనీసం రెండు తిన్నా.. మనకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
పండిన పనసకాయలో విటమిన్లు సి, ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు.. దీనిలో పొటాషియం, ఫైబర్ లాంటి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యంపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తాయి. నార్మల్ గా పండులానే తినొచ్చు.. లేదంటే... చాలా రకాల వంటలు కూడా దీనితో తయారు చేస్తారు. మరి దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
నార్మల్ గా డయాబెటిక్ పేషెంట్స్ అన్ని పండ్లు తినకూడదు. ఎందుకంటే.. వారి షుగర్ లెవల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కానీ... పనస పండు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా, భయం లేకుండా తినొచ్చు. పనస పండు రుచికి తియ్యగా ఉన్నా... బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ ఈ పండును తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు.
jackfruit
పండిన పసన పండులో... ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. మలబద్దకం లాంటి సమస్య ఉన్నా తగ్గించేస్తుంది. అరుగుదల సమస్యలన్నీ పరార్ అయిపోతాయి.
అంతేకాదు.. పసన తొనలు తినడం వల్ల.. మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎందుకంటే.. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బలపరుస్తుంది. సీజన్ తో పాటు వచ్చే చాలా రకాల సమస్యలు తగ్గిపోయేాలా చేస్తాయి
ఇక.. ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు ఎంత మంది ఉన్నారో.. ఏం తిన్నా బరువు పెరగడం లేదని బాధపడేవారు కూడా అంతే ఉన్నారు. అలాంటివారు.. ఈ పనస పండు తినడం వల్ల... బరువు పెరగవచ్చు. ఎందుకంటే.. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి.
అంతేకాదు... ఎవరైనా హై బీపీతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే.. వాళ్లు పనస పండు తింటే చాలు. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. దీనిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే.. మీకు ఏవైనా అలర్జీలు ఉంటే... వీటికి దూరంగా ఉండటమే మంచిది.