Fish: చేపల్లో ఈ భాగాన్ని మాత్రం అస్సలు వదలొద్దు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చేప కళ్లు కూడా ఎంతో శక్తివంతమైన పోషకాలు కలిగి ఉంటాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

చేపలు తింటున్నారా?
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సముద్ర ఆహారం. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చేపలను ఇంటికి తెచ్చుకొనేటప్పుడు చాలా మంది మార్కెట్లోనే వాటిని శుభ్రం చేయించి మరీ తెచ్చుకుంటారు. అలా శుభ్రం చేసే సమయంలో వాటి కళ్లను తీసేస్తూ ఉంటారు. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. చేప కళ్లు కూడా ఎంతో శక్తివంతమైన పోషకాలు కలిగి ఉంటాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి, చేప కళ్లను రెగ్యులర్ గా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
1.కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది...
చేప కళ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మరింత మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. చాలా మందికి రాత్రి సమయంలో చూపు సరిగా కనపడదు. అలాంటివారు ఈ చేప కళ్లను తినడం వల్ల ఆ సమస్య కూడా తగ్గుతుంది. పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే వీటిని తినడం అలవాటు చేస్తే... కంటి చూపు బాగుంటుంది.
2. ఊబకాయం, మధుమేహం నియంత్రణ
చేప కళ్ళలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో శక్తిని సమంగా వినియోగించడంలో సహాయపడతాయి. ఇది ఇన్‌సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి మధుమేహాన్ని నియంత్రణలోకి తీసుకురాగలదు. ఊబకాయంతో బాధపడే వారికి శరీర బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది.
3. రక్తపోటు తగ్గించే చేప కళ్లు..
హై బీపీ ఉన్నవారు చేప కళ్లను తినడం వల్ల రక్తనాళాలు సరిగా పని చేస్తాయి. ఇది రక్తప్రసరణను బాగా నిర్వహించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి..
4. మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుదల
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి ప్రధానంగా అవసరమయ్యే పోషకాలు. చేప కళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మతి మరుపు తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను కూడా దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
5. ఆటిజం బాధితులకు ఉపశమనం..
న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే పిల్లలు లేదా పెద్దలకు చేప కళ్ళు సహజమైన ఆహార దోహదంగా పనిచేస్తాయి. వాటిలోని పోషకాలు మెదడు క్రియాశీలతను పెంచి, ఆటిజం లక్షణాలను కొంతవరకు తగ్గించగలవు. ముఖ్యంగా చిన్నపిల్లల వికాసానికి ఇది సహాయపడుతుంది.
6. ఎముక బలం, చర్మ ఆరోగ్యం
చేప కళ్లల్లో కాల్షియం , విటమిన్ డి లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి అవసరం. అలాగే చర్మం యవ్వనంగా కనిపించడానికి, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేయడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి.
మంచి నిద్రకు సహాయపడతాయి..
విటమిన్ డి మోతాదు చేప కళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇది మెలటొనిన్ హార్మోన్ స్రావాన్ని ప్రోత్సహించి మంచి నిద్రను కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు చేప కళ్లను తీసుకుంటే మంచి విశ్రాంతినిచ్చే నిద్రను పొందవచ్చు.
8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవు
చేప కళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు కొన్ని రకాల క్యాన్సర్ లను నిరోధించడంలో కూడా సహాయపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సెల్ గ్రోత్‌ను నియంత్రించి, అనారోగ్యకరమైన సెల్స్ పెరగకుండా చూస్తాయి.
ఫైనల్ గా...
చేప కళ్ల రుచి పరంగా కొంత మందికి ఇష్టంగా ఉండకపోవచ్చు కానీ అవి పోషకాల పరంగా సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. కంటి ఆరోగ్యం, మెదడు శక్తి, ఎముకల దృఢత్వం, శక్తివంతమైన రోగ నిరోధక శక్తి కోసం చేప కళ్లను మీ ఆహారంలో చేర్చుకోండి.