Banana: ప్రతిరోజూ పరగడుపున అరటి పండు తింటే ఏమౌతుంది?
అరటి పండు తినడం అంటే.. బ్యాటరీ ఛార్జ్ చేయడం లాంటిది. ఉదయాన్నే ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి సహాయపడుతుంది.

Banana
ఎవరికైనా సులభంగా లభించే పండు ఏదైనా ఉంది అంటే అది అరటి పండు మాత్రమే కాదు. ఈ పండు అందుబాటులో ఉండటం మాత్రమే కాదు.. చాలా చౌక ధరలో కూడా లభిస్తుంది. ఈ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి, ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున అరటి పండు తింటే ఏమౌతుంది? దీని వల్ల మనకు లాభాలున్నాయా? నష్టాలున్నాయా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
తక్షణ శక్తి...
అరటి పండు ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల శరీరానికి వెంటనే ఎనర్జీ వస్తుంది. ఈ పండులో ఉండే సహజ కార్బో హైడ్రేట్లు, విటమిన్ బి6, బి1 మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అరటి పండు తినడం అంటే.. బ్యాటరీ ఛార్జ్ చేయడం లాంటిది. ఉదయాన్నే ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ చెక్కర శోషణను ఆలస్యం చేస్తుంది. రోజంతా అలసిపోకుండా.. చురుకుగా ఉంటారు.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది...
ఒక అరటి పండులో దాదాపు 3 నుంచి 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, మలబద్దకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. ప్రేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెరగడానికి సహాయపడుతుంది. రోజూ ఒక్క పండు తిన్నా.. మొత్తం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అందుకే.. అరటి పండు ప్రేగులకు మంచిదని చెబుతుంటారు.
రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది:
అరటిపండ్లు లో దాదాపు 380 - 420 mg పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం శరీరం నుండి అదనపు సోడియంను బయటకు పంపుతుంది. రక్త నాళాలను నియంత్రిస్తుంది. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. ఇది మీ గుండె , కండరాలకు శక్తినిస్తుంది . అందువల్ల, ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో , రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో చాలా సహాయపడుతుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
అరటిపండ్లలోని విటమిన్ B6 , ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ , డోపమైన్‌ను పెంచుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పరగడుపున అరటిపండు తినడం వల్ల మీరు రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.