నెల రోజులు బ్రేక్ ఫాస్ట్ లో ఒక ఆపిల్ తినండి చాలు..
పండ్లలో ఆపిల్ పండు ఒకటి. కానీ దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఒక ఆపిల్ పండును తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
ఆపిల్ ఒక పండు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి దివ్య ఔషదం కూడా. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతుంది. అలాగే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల డ్యామేజ్ ను ఆపుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు ఒక నెల పాటు రోజూ ఒక ఆపిల్ ను బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?
రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ పండును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ఫైబర్ : ఆపిల్ పండ్లలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీకు అతిగా ఆకలి కాకుండా చేస్తుంది. దీనివల్ల మీరు అనవసరమైన చిరుతిండిని తినకుండా ఉంటారు. అలాగే ఆహార కోరికలు కూడా తగ్గుతాయి. ఆపిల్ పండును తినడం వల్ల మీరు కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు: ఆపిల్ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా బరువు తగ్గడానికి వీటిని తినొచ్చు.
మెటబాలిజంను పెంచుతుంది: ఆపిల్ పండ్లలో ఉండే కొన్ని పదార్థాలు మీ మెటబాలిజాన్ని పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. జీవక్రియ పెరిగితే మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్ : ఆపిల్ పండ్లు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ క్రమంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. దీంతో మీ ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంటుంది. ఇది మీరు బరువు పెరగకుండా కాపాడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: ఆపిల్ పండ్లు మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే పెక్టిన్ అనే కరిగే ఫైబర్ రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది: మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్రణలో ఉండాలి. అయితే ఆపిల్ పండ్లలో ఉండే పొటాషియం మీ రక్తపోటును కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ఆపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెపోటు రిస్క్ ను తగ్గిస్తాయి.
ఆపిల్ ను తినడం వల్ల నెల రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
ఆపిల్ పండును ప్రతిరోజూ మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల కొన్ని కిలోల బరువు తగ్గుతారు. అలాగే ఈ పండు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఆపిల్స్ లో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఈ పండులో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా చేస్తుంది.