ఈ డ్రింక్.. మీ పొట్టలో కొవ్వును వెన్నలా కరిగిస్తుంది...ట్రై చేసి చూడండి..!
ఒక ఆయుర్వేద డ్రింక్ అది కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగితే.. మనం ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చని మీకు తెలుసా? ఆ డ్రింక్ ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..? ఎప్పుడు తాగాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
belly fat
బరువు మనకు తెలీకుండానే పెరిగిపోతాం. మనం చాలా బరువు పెరిగిపోయాం అని రియలైజ్ అయ్యేసరికే చాలా ఆలస్యం అవుతుంది. అప్పటికే బెల్లీ ఫ్యాట్ బెలూన్ మాదిరి పెరిగిపోతుంది. ఇక.. ఆ బరువు తగ్గించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తినడం తగ్గించడం దగ్గర నుంచి... వ్యాయామాలు చేయడం వరకు చాలా ప్రయత్నాలు చేస్తారు. బరువు అయినా.. ఏదో ఒక విధంగా కాస్త తొందరగా తగ్గించొచ్చు. కానీ... బెల్లీ ఫ్యాట్ మాత్రం అంత ఈజీగా కరగదు. దానిని కరిగించడానికి పొట్ట వ్యాయామాలు చాలా చేయాల్సి ఉంటుంది. అవి చేసినా ఫలితం వస్తుందనే నమ్మకం ఉండదు.
belly fat
జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, గంటల కొద్దీ కుర్చీల్లో కూర్చోవడా వల్ల కూడా ఈ బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణం కావచ్చు. ప్రస్తుతం మనకు మార్కెట్లో బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి చాలా డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ... వాటికి బదులు.. ఒక ఆయుర్వేద డ్రింక్ అది కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగితే.. మనం ఈజీగా బెల్లీ ఫ్యాట్ ని కరిగించవచ్చని మీకు తెలుసా? ఆ డ్రింక్ ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..? ఎప్పుడు తాగాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ డ్రింక్ తయారీలో మనం సబ్జా గింజలను వినియోగిస్తాం. సబ్జా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వును కరిగించడంలో చాలా బాగా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల.. కార్బో హైడ్రేట్స్ శోషణ తగ్గుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు... బరువు తగ్గడంలో, బెల్లీ ఫ్యాట్ కరిగించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది.
సబ్జా గింజలతో పాటు.. మనం ఈ డ్రింక్ తయారీలో నిమ్మకాయను కూడా వాడతాం. నిమ్మకాయ సహజంగానే జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయం చేస్తుంది. మనం దాహార్తిని తగ్గిస్తుంది. మంచి డీటాక్స్ గా పని చేస్తుంది. కడుపులో ఉండే చికాకును కూడా తగ్గిస్తుంది. అదనంగా నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ఖనిజాలు.. శరీరానికి కూడా మేలు చేస్తాయి. బలన్ని కూడా అందిస్తాయి.
మూడవ పదార్ధం తేనె. ఇది ఆయుర్వేదం పరంగా.. శరీరంలో కొవ్వు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మంచి రుచితో పాటు శరీరానికి కూడా మేలు చేస్తుంది. ఇది రుచిలో తీపిగా ఉంటుంది, కాబట్టి ఇది రోజంతా షుగర్ క్రేవింగ్స్ ని కూడా ప్రభావితం చేస్తుంది. తేనె వెచ్చని ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది మంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది అదనపు కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ మూడింటినీ కలిపి హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
మీరు ఉదయం గది ఉష్ణోగ్రత వద్ద ఒక కప్పు నీటిని తీసుకోవాలి.
అందులో 1 టీస్పూన్ సబ్జా గింజలు వేసి బాగా కలపండి.
అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి.
చివర్లో, 1 టీస్పూన్ తేనె వేసి ప్రతిదీ బాగా కలపాలి.
దీన్ని తయారు చేసిన తర్వాత, మీరు 30 నిమిషాల తర్వాత మాత్రమే త్రాగాలి, తద్వారా అన్ని విషయాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.
ఇక.. ఈ డ్రింక్ ని రోజూ ఉదయం పరగడుపున తాగితే సరిపోతుంది. రెగ్యులర్ గా దీనిని తాగడం వల్ల.. మీరు అతి తక్కువ సమయంలోనే ఎఫీషియంట్ రిజల్ట్ చూస్తారు.