Navratri: నవరాత్రుల వేళ ఉపవాసం చేస్తున్నారా..? ఈ తప్పులు చేయకండి..!
Navratri: ఉపవాసం చేసే సమయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తాయని మీకు తెలుసా? మరి.. ఉపవాసం చేసే సమయంలో.. ఎలాంటి తప్పులు చేయకూడదు..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం కచ్చితంగా తెలుసుకోవాలి…

Navaratri Fasting
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. నవరాత్రుల వేళ దాదాపు చాలా మంది ఉపవాసం ఉంటారు. భక్తితో దుర్గామాతను పూజిస్తూ రోజంతా ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పండ్లు లాంటివి మాత్రమే తీసుకుంటారు. అయితే.. ఈ ఉపవాసం చేసే సమయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తాయని మీకు తెలుసా? మరి.. ఉపవాసం చేసే సమయంలో.. ఎలాంటి తప్పులు చేయకూడదు..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
పరగడుపున టీ, కాఫీలు తాగడం...
ఉపవాసం చేసే సమయంలో చాలా మంది తమ కడుపును టీ, కాఫీలతో నింపేస్తూ ఉంటారు. కానీ... ఇది చాలా పెద్ద తప్పు. టీ, కాఫీల్లో కెఫిన్ ఉంటుంది. ఇది... కడుపులో ఎసిడిటీ పెరగడానికి కారణం అవుతుంది. ఇది కడుపులో, గుండెల్లో మంటకు దారితీస్తుంది. అందుకే... పరగడుపున టీ, కాఫీలు తాగకూడదు. వాటికి బదులుగా మీరు నిమ్మకాయ నీరు, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. మీ కడుపు కూడా హాయిగా అనిపిస్తుంది.
తక్కువ నీరు తాగడం...
సాధారణంగా ప్రజలు ఉపవాసం సమయంలో వారి ఆహారం , పానీయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కానీ మంచి నీరు తాగడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ గా మారి.. మలబద్దకం, ఎసిడిటీ కి దారితీస్తుంది. అందువల్ల, రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి. మీరు కీరదోసకాయ, పుచ్చకాయ వంటి నీరుగల పండ్లు , కూరగాయలను తినవచ్చు.
ఎక్కువ గంటలు ఖాళీ కడుపుతో ఉండటం...
కొంతమంది ఉపవాసం సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటారు. దీని వలన కడుపులో ఆమ్లం ఏర్పడుతుంది. ఇది గ్యాస్ , ఎసిడిటీకి దారితీస్తుంది. తరచుగా స్నాక్స్ తినండి. ఉదయం నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ , అరటిపండ్లు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
సిట్రస్ పండ్లు ఎక్కువగా తినడం
కొంతమంది ఉపవాస సమయంలో పండ్లు తినడం మంచిదని నమ్ముతారు. ఇది నిజమే, కానీ సిట్రస్ పండ్లను పరిమితం చేయండి. మీకు ఇప్పటికే ఎసిడిటీ ఉంటే, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఖాళీ కడుపుతో తినకుండా ఉండండి. బదులుగా, మీరు అరటిపండ్లు, బొప్పాయి లేదా ఆపిల్ తినవచ్చు.
నూనెలో వేయించిన ఆహారాలు...
ఉపవాసం ముగిసిన తర్వాత... ఎక్కువగా చాలా మంది నూనెలో వేయంచిన పూరీలు, పకోడీలు, బంగాళ దుంప చిప్స్ లాంటివి తింటూ ఉంటారు. చాలా గంటలపాటు ఉపవాసం చేసిన తర్వాత ఇలాంటి ఆయిల్ ఫుడ్ తినకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులు, సగ్గుబియ్యం తో చేసిన కిచిడీ, పెరుగు, బంగాళదుంపలను ఉడికించిన ఆహారం లాంటివి తీసుకోవాలి. నూనె తక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు...
మీ రోజుని గోరువెచ్చి నీటితో ప్రారంభించాలి. ఆ తర్వాత సబ్జా గింజలను నీటిలో నానపెట్టి... ఆ నీటిని తాగాలి. కావాలంటే అటి పండు తినొచ్చు. మధ్యాహ్న సమయంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. ఆకలికి తట్టుకోలేకపోతే... సగ్గుబియ్యం కిచిడీ, మఖానా లాంటి తేలిక ఆహారం తీసుకోవాలి.