MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏమౌతుందో తెలుసా?

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏమౌతుందో తెలుసా?

బూడిద గుమ్మడికాయ తొందరగా ఎవరూ తినరు. కానీ.. దీనిని కనుక డైట్ లో భాగం చేసుకుంటే.. మనం ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 07 2024, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ash gourd juice

ash gourd juice


 

నిజం చెప్పాలంటే  ఈ రోజుల్లో దాదాపు మనం అందరం బ్యాడ్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నవాళ్లమే. ఆరోగ్యకరమైన ఆహారం తినడం లేదు, శారీరక శ్రమ అంతకన్నా ఉండటం లేదు. ఈ క్రమంలోనే వెంట వెంటనే జబ్బుల బారినపడుతున్నారు. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతోంది. వీటి నుంచి మనం బయటపడాలంటే.. మంచి పండ్లు, కూరగాయలపై ఆధారపడాల్సి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో బూడిద గుమ్మడికాయ ముందు వరసలో ఉంటుంది. ఆరోగ్యం కోసం రోజూ పండ్లు, కూరగాయలు తమ డైట్ లో భాగం చేసుకనేవారు చాలా మంది ఉంటారు. కానీ.. బూడిద గుమ్మడికాయ తొందరగా ఎవరూ తినరు. కానీ.. దీనిని కనుక డైట్ లో భాగం చేసుకుంటే.. మనం ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. మరి.. ఆ ఉపయోగాలేంటో చూద్దాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ash Gourd

Ash Gourd

 

బూడిద గుమ్మడికాయలో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, ఫైబర్, యాంటీ ఒబేసిటీ, యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి. అందుకే.. వీటిని డైట్ లో తీసుకోవడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 

ఈ రోజుల్లో ఒత్తిడి లేనివాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఆఫీసు ఒత్తిడి, మనీ ప్రాబ్లం ఇలా కారణాలు ఏదైనా ఒత్తిడి వచ్చేస్తోంది. ఇది  చాలా డేంజర్. కానీ.. ఆ ఒత్తిడిని ఈ గుమ్మడికాయ తగ్గిచేస్తుంది. అంతేకాదు.. ఈ జ్యూస్ మనకు శక్తిని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది.

 

35
Ash gourd juice

Ash gourd juice

 

ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే.. వారు కూడా ఈ గుమ్మడికాయను తీసుకోవచ్చు. గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా కూడా కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా.. ఆ రాళ్లు కరిగిపోతాయి.

 

అంతేకాదు గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అరుగుదల సమస్యలు ఏమైనా ఉన్నా, మలబద్దకం సమస్య ఉన్నా.. ఈ గుమ్మడికాయను తీసుకోవడం వల్ల… ఆ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

 

45
Ash Gourd

Ash Gourd

 

అంతేకాకుండా.. మీరు బూడిద గుమ్మడికాయ ను తీసుకోవడం వల్ల  గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ రోజూ తాగితే.. శరీరంలో ఫ్యాట్  కరిగించడంలో సహాయం చేస్తుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది.

 

55
Drink ash gourd juice and lose weight

Drink ash gourd juice and lose weight

 

దీనిని ఎలా తీసుకోవాలి అంటే.. గుమ్మడికాయ తొక్క మొత్తం తీసేయాలి. ఆ తర్వాత.. గుమ్మడికాయ ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను మిక్సర్ లో వేసి.. జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒక క్లాత్ లో వేసి.. వడకొట్టుకోవాలి. అంతే.. రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది. 

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved