MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలున్నాయా? అయితే ఇప్పటి నుంచి వీటిని తినండి

ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలున్నాయా? అయితే ఇప్పటి నుంచి వీటిని తినండి

మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంది. మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి మంచి ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలను మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. 
 

R Shivallela | Published : Sep 26 2023, 02:51 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
constipation

constipation

మన పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే మనం హెల్తీ ఆహారాలను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అంతేకాదు గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు, అపానవాయువు (పిత్తులు) వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం హెల్తీ ఫుడ్స్ ను ఖచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థ బాగుంటే ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Asianet Image

పెసరపప్పు కిచిడీ

పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మీకు తెలుసా? ఈ పప్పును తింటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణక్రియ బలహీనంగా ఉండి ఎన్నో సమస్యలతో బాధపడేవారు పెసరపప్పు కిచిడీని రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ పప్పు చాలా సులువుగా జీర్ణమవుతాయి. దీంతో మీ జీర్ణక్రియ బాగుంటుంది. 
 

 

36
Asianet Image

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పెరుగును తింటే కూడా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. పెరుగు మంచి ప్రోబయోటిక్. ఇది మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు అజీర్థి సమస్య ఉంటే రోజూ ఒక గిన్నె పెరుగును తినండి. పెరుగు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

46
Asianet Image

ఉడికించిన బంగాళాదుంపలు

జీర్ణ సమస్యలు మరీ ఎక్కువగా ఉండటం వల్ల నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినొచ్చు. బంగాళాదుంపలు గొప్ప శక్తి వనరు. అయితే మీరు దీనికి మసాలా దినుసులను కలపొద్దు. మీ పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ఉడికించిన బంగాళాదుంపల్లో కొంచెం ఉప్పును కలిపి తినాలి.
 

56
Asianet Image

హెర్బల్ టీ

కొన్ని టీలు కడుపునకు సంబంధించిన సమస్యను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం హెర్బల్ టీ లను మీరు రెగ్యులర్ గా తాగొచ్చు. హెర్బల్ టీలు వికారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటానికి అల్లం టీ, చామంతి టీ, పుదీనా టీ లేదా ఫెన్నెల్ టీ లను తాగొచ్చు. 
 

66
Asianet Image

అరటి పండు

అరటిపండు మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ పండులో పొటాషియం, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. డయేరియా సమస్య నుంచి బయటపడటానికి అరటిపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి శక్తి లభించి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

R Shivallela
About the Author
R Shivallela
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories