MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • మరమరాలు తింటే ఏమౌతుందో తెలుసా?

మరమరాలు తింటే ఏమౌతుందో తెలుసా?

మరమరాలను ఎన్నో విధాలుగా చేసుకుని తినొచ్చు. వీటిని ఎలా తిన్నా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. కానీ వీటిని తింటే ఏమౌతుందో తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Jan 17 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మరమరాల టేస్ట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవెనింగ్ స్నాక్స్ లో రకరకాలుగా చేసుకుని తినొచ్చు. వీటిని ఏ విధంగా తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని బాగా తింటుంటారు. నిజానికి ఇవి టేస్టీగా ఉండటమే కాకుండా మన శరీరానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మరమరాలను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


మరమరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఈజీ టిఫిన్ 

అవును.. మరమరాలతో చాలా సులువుగా, ఫాస్ట్ గా, టేస్టీగా టిఫిన్ ను చేసుకుని తినొచ్చు.  ప్రతిరోజూ అన్నం తిని బోరింగ్ గా అనిపిస్తే.. మీరు ఈ మరమరాలతో బ్రేక్ ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మరమరాలను కొనుక్కుని నీళ్లలో ముంచి తీసి కొద్దిగా నూనె, ఆవాలతో పోపు చేసి అందులో కాసేపు వేయించి తినడమే. జస్ట్ పది నిమిషాల్లోనే టేస్టీ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ ను చేసుకుని తినేయొచ్చు. దీని టేస్ట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 

35

అజీర్ణం

మరమరాలు అన్నంలా కాదు. అన్నమైతే అరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ మరమరాలు మాత్రం చాలా తొందరగా జీర్ణమవుతాయి. వీటిని తింటే మీ జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. వీటిని తింటే అజీర్ణం అనే సమస్యే ఉండదు. 
 

45

శక్తి

అన్నంలో మాదిరిగా మరమరాల్లో కూడా కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీటిని తింటే మనం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. అలసట నుంచి ఉపశమనం కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

డయాబెటీస్ ఉన్నవారికి మంచివి

మరమరాలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో చక్కెర విడుదలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఇవి తినాలంటారు.
 

55

మెదడు ఆరోగ్యం

మరమరాలు మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, దాని పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. 

బరువును తగ్గిస్తుంది

మరమరాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నాన్ని తింటే మీరు ఎన్నటికీ బరువు తగ్గరు. అన్నానికి బదులుగా మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మరమరాలను తింటే మాత్రం పక్కాగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారికి  ఇది బెస్ట్ ఫుడ్ అవుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది
Recommended image2
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image3
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved