పొట్టు మినపప్పు తో చేసిన ఇడ్లీ, దోశ తింటే ఏమౌతుంది?
నార్మల్ మినపప్పు కాకుండా.. పొట్టు మినపప్పుతో వీటిని చేసుకొని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం….
దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇడ్లీ, దోశ, వడ వంటి బ్రేక్ ఫాస్ట్ లను రోజూ తింటూ ఉంటాం. వీటన్నింటినీ మనం మినపప్పు తో మాత్రమే చేయగలం. నార్మల్ మినపప్పు కాకుండా.. పొట్టు మినపప్పుతో వీటిని చేసుకొని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం….
1.పేగు ఆరోగ్యం…
పొట్టు మినపప్పు ముఖ్యంగా నల్ల పొట్టు మినపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పేగు కదలికలు సరిగ్గా ఉంటాయి. జీర్ణ ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతుంది. ప్రేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు.. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మల విసర్జన సవ్యంగా జరుగుతుంది. మలబద్దకం, విరేచనాలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
అధిక బరువు తగ్గిస్తుంది…
బరువు తగ్గాలనుకునే వారికి మినపప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల అతిగా తినడం నియంత్రణలో ఉంటుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది….
పొట్టు మినపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో మినపప్పు చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగడాన్ని నిరోధించవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా జీర్ణాశయంలోని అదనపు గ్లూకోజ్‌ను శోషణ, తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మిన పప్పులోని ఫైబర్ పోషకాలను తగినంతగా గ్రహించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర, గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో మినపప్పు చేర్చుకోవచ్చు.
ఎముకలు దృఢంగా మారుతాయి
పొట్టు మినపప్పు లోని ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి పోషకాలు ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఎముకలు అంత దృఢంగా ఉంటాయి. కాబట్టి దృఢమైన ఎముకలు పొందడానికి, మీ ఆహారంలో క్రమం తప్పకుండా వీటిని చేర్చుకోవాలి.