ఆఫీసులో నిద్ర ఆపుకోలేకపోతున్నారా? ఈ 5 టిప్స్ పాటిస్తే మీరు హ్యాపీగా పనిచేసుకోవచ్చు
ఆఫీసులో నిద్ర.. అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ ఇది. ఎంత ఆపుకుందామన్నా నిద్ర కంట్రోల్ కాదు కదా.. ఈ 5 రకాల ఆహారాలు తినడం మానేస్తే పని చేసేటప్పుడు నిద్రమత్తు మీ దరిచేరదు. అవేంటో తెలుసుకుందాం రండి.
సేమ్ ఫుడ్ రెండు సార్లు వద్దు
చాలా మంది ఉదయం ఇంట్లో తిన్న ఆహార పదార్థాలనే మధ్యాహ్నం భోజనానికి ప్యాక్ చేసి తీసుకొస్తుంటారు. రెండు సార్లు ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల ఆటోమెటిక్ గా నిద్ర మత్తు ఆవరిస్తుంది. ఇది మీ పనికి ఆటంకం కలిగిస్తుంది. దీంతో మీరు ఆఫీస్ లో పనిచేస్తూ నిద్రపోవాల్సి వస్తుంది. మీ బాస్ చూస్తే మీకు తిట్లు తప్పవు. అందువల్ల ఒకే ఫుడ్ ఐటమ్ ను రెండు పూటలా తినకండి. ముఖ్యంగా ఆఫీస్ వర్కింగ్ టైమ్ లో అస్సలు తినవద్దు.
వేపుళ్ళు, కేక్ ఐటమ్ ల జోలికి పోవద్దు
సాధారణంగా వేపుళ్లు చాలా లేట్ గా అరుగుతాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేపుడు పదార్థాలు తినేటప్పుడు చాలా టేస్ట్ గా ఉంటాయి. కాని అరుగుదల తక్కువ. అందువల్ల ఆఫీస్ లో ఉన్నప్పుడు వాటి జోలికి పోకండి. నిద్రపోతూ పనిచేసి తిట్లు తినకండి. ఇంకో విషయం ఏమిటంటే కేకులు, పేస్ట్రీలు వంటి బేకరీ వస్తువులను కూడా తక్కువగా తినడం మంచిది. ఎందుకంటే ఇవి మిమ్మల్ని నిద్రమత్తులోకి తీసుకెళతాయి. అలసటకు గురి చేస్తాయి. ఆఫీసులో ఉన్నప్పుడు చురుగ్గా పని చేయాలి కనుక అధిక కొవ్వు పదార్థాలున్న ఇలాంటి ఫుడ్ తినకుండా ఉండటం ఉత్తమం.
అన్నం తిన్నా నిద్ర మత్తు తప్పదు
జీర్ణక్రియ సమయంలో బియ్యంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారతాయి. గ్లూకోజ్‌కు ప్రతిస్పందనగా ఇన్సులిన్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల స్థాయిలను పెంచుతుంది. ఈ హార్మోన్లు విశ్రాంతి, నిద్రమత్తును ప్రోత్సహిస్తాయి. అందుకే మధ్యాహ్న భోజనంలో రైస్ ఐటమ్ తిన్న వాళ్లు నిద్రమత్తుతో ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కడ ఉన్నా కునిపాట్లు పడుతూ కనిపిస్తార. మీరు ఆఫీస్ లో కూర్చొని పనిచేయాలి కనుక రైస్ ఐటమ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది.
ఇవి తినకుండా ఉంటేనే మంచిది
వోట్స్, బియ్యం, టమోటాలు, పుట్టగొడుగులు, పిస్తాపప్పులు, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ ఐటమ్స్ తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అందుకే ఆఫీసు వర్కింగ్ టైమ్ లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎంత తినకుండా ఉంటే అంత మంచిది. ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే వారికే ఎక్కువ నిద్ర మత్తు వచ్చే అవకాశం ఉంది. తిరుగుతూ పని చేయడం, బరువులు ఎత్తుతూ పనిచేసే వారికి ఎలాంటి ఫుడ్ తిన్నా అరుగుదలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ప్రోటీన్ ఆహారం
అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం వల్ల అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. మీరు రోజంతా చురుకుగా ఉండాలనుకుంటే ప్రోటీన్ తీసుకోవడం అవసరం. పాలు, పాలకూర, విత్తనాలు, సోయా ఉత్పత్తులు, చికెన్ ఉత్పత్తులను మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకోవడం మంచిది కాదు. జీర్ణం కావడానికి ఎక్కువ శక్తిని తీసుకునే ఈ ఆహారాల ద్వారా నీరసం పెరుగుతుంది. మీ శరీరం కూడా విశ్రాంతి కోరుకుంటుంది. అందువల్ల ఆఫీసు వేళల్లో ఇలాంటి ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
చక్కెర ఐటమ్స్ తో నిద్ర తప్పదు
ఈ కాలంలో చక్కెర లేకుండా ఏ ఫుడ్ ఐటమ్ తయారు కావడం లేదు. స్వీట్లలో ఇంతకు ముందు బెల్లం కూడా వాడేవారు. ఇప్పుడు అన్నింట్లోనూ చక్కెరే ఉపయోగిస్తున్నారు. చక్కెరతో కూడిన ఆహారాలు కూడా మిమ్మల్ని నిద్రమత్తుకు గురి చేస్తాయి. చక్కెర శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే దానిని ఎక్కువగా తీసుకోవడం మీకు మంచిది కాదు. అదనంగా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మిమ్మల్ని నీరసంగా చేస్తుంది. మంచి ఆరోగ్యానికి ప్రతిదీ మితంగానే తీసుకోవాలి.