Food: వీటిని నీటిలో నానపెట్టిన తర్వాతే తినాలి అని మీకు తెలుసా?
ఆరోగ్యానికి ఎంత మంచివి అయినా, వాటిలో ఎన్ని ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నా.. నానపెట్టి తింటేనే అవి మనకు అందుతాయట. మరి, అవేంటో తెలుసుకుందామా..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ఒక్కో ఫుడ్ ని ఒక్కోలా తినాలి. కొన్నింటిని పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. కొన్నింటిని ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. అలా తింటేనే శరీరానికి కావాల్సిన పోషకాలు మన శరీరానికి అందుతాయి.మరి, కచ్చితంగా నానపెట్టిన తర్వాత మాత్రమే తినాల్సినవి కొన్ని ఉన్నాయి.అవి ఆరోగ్యానికి ఎంత మంచివి అయినా, వాటిలో ఎన్ని ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నా.. నానపెట్టి తింటేనే అవి మనకు అందుతాయట. మరి, అవేంటో తెలుసుకుందామా..
1.ఎండు ద్రాక్ష..
ఎండుద్రాక్ష ను మనం కిస్ మిస్ అని కూడా పిలుస్తాం. వీటిని మనం నానపెట్టిన తర్వాతనే తినాలి అనే విషయం మీకు తెలుసా? రాత్రిపూట నీటిలో నానపెట్టి తినడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ పెరుగుతుంది. వాటిలో ఉండే సహజ చెక్కరలు సులభంగా జీర్ణ కావడానికి కూడా సహాయం చేస్తాయి. ఉదయం పూట తినడం వల్ల.. ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది.
2.బాదం..
బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని కూడా కచ్చితంగా నానపెట్టి మాత్రమే తినాలి. బాదం పప్పులపై ఉండే గోధుమ రంగు తొక్క లో టానిన్లు ఉంటాయి. ఇది పోషణ శోషణను నిరోధిస్తుంది. అందుకే, వీటిని నానపెట్టి తినాలి. బాదం రాత్రిపూట నానపెట్టిన తినడం వల్ల మన చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తొక్క తీసేసి తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
నానబెట్టిన బాదంపప్పులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
3.చియా సీడ్స్..
చియా గింజలు వాటి బరువు కంటే 10–12 రెట్లు నీటిలో గ్రహిస్తాయి. వీటిని నార్మల్ గా తీసుకుంటే జీర్ణక్రియలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చియా గింజలను నానబెట్టడం వల్ల జెల్ లాంటి ఆకృతి ఏర్పడుతుంది, ఇది హైడ్రేషన్‌కు మద్దతు ఇస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పోషక లభ్యతను మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
<p><strong>Legumes: </strong>The Indian diet is legume-heavy. Rajma-chawal is a universally loved dish across the country. It also helps that it is extremely healthy. Legumes are great for the heart and have antioxidants, proteins and fiber. They are also a great source to get your folate requirement from. Like berries they also help in increasing the platelet activity.</p>
చిక్కుళ్ళు
చిక్కుళ్ళలో ఫైటిక్ ఆమ్లం, ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఉంటాయి, ఇవి పోషక శోషణను తగ్గిస్తాయి. నానబెట్టడం వల్ల వీటిని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, వంట సమయాన్ని తగ్గిస్తుంది. చిక్కుళ్ళు మరింత జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరం కూడా తగ్గిస్తుంది
మెంతి గింజలు
ఈ విత్తనాలు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి కానీ పచ్చిగా తింటే కడుపుకు కష్టంగా ఉంటుంది. మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టడం వల్ల వాటిని నమలడం , జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది, వాటి శోథ నిరోధక లక్షణాలను పెంచుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది.