MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Viral news: ఆగస్టు 12న భూమిపై ఉన్న ప్రజలు కొన్ని సెకన్ల పాటూ గాలిలో తేలుతారా?

Viral news: ఆగస్టు 12న భూమిపై ఉన్న ప్రజలు కొన్ని సెకన్ల పాటూ గాలిలో తేలుతారా?

Viral news: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఆగస్టు 12న భూమి గురుత్వాకర్షణ కొన్ని సెకన్ల పాటు పూర్తిగా పోతుందని, ఆ సమయంలో ప్రజలు గాలిలో తేలుతారని దాని సారాంశం. ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాము. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 23 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మనం గాలితో తేలుతామా?
Image Credit : chat gpt

మనం గాలితో తేలుతామా?

ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇలా ఊహించుకోండి.. మీరు వీధిలో నడుస్తూ వెళుతుంటే మీ రెండు పాదాలు భూమిపై కాకుండా గాలిలో తేలడం మొదలుపెడితే.. ఒక్కసారిగా ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. ఆగస్టు 12న కొన్ని సెకన్ల పాటు మనిషులు ఇదే అనుభూతికి లోనవుతారని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వాదనకు ప్రాజెక్టు యాంకర్ అనే పేరును కూడా పెట్టారు. నిజంగానే ఆగస్టు 12న ఈ వింత జరగబోతుందా? ఆరోజు గురుత్వాకర్షణ శక్తి కొన్ని సెకన్ల పాటు మాయం అయిపోతుందా? మనం గాలిలో తేలుతామా? ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రాజెక్టు యాంకర్ నిజమేనా?
Image Credit : Getty

ప్రాజెక్టు యాంకర్ నిజమేనా?

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఆగస్టు 12న గురుత్వాకర్షణను అకస్మాత్తుగా కోల్పోతుందని ఒక రహస్య నాసా నివేదిక చెప్పింది. ఆ సమయంలో ప్రజలు గాలిలో తేలుతారని ఆ వైరల్ వార్త వివరిస్తోంది. అయితే ఈ వాదన ఇలా సోషల్ మీడియాలో మొదలైందో లేదో అప్పుడే అది వైరల్‌గా మారిపోయింది. కానీ నిజానికి ఈ వాదన పూర్తిగా అబద్ధం. ప్రపంచంలో ప్రాజెక్టు యాంకర్ అనే మిషన్ ఏదీ లేదు. అలాగే ఈ వాదన సమర్థించే ఎలాంటి ఆధారాలు కూడా లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ వాదన మొత్తం ఒక అపోహ మాత్రమే.

34
భూమి బరువుగా ఉన్నంత కాలం
Image Credit : Getty

భూమి బరువుగా ఉన్నంత కాలం

భూమికి ఉన్న గురుత్వాకర్షణ అనేది ఆన్ చేయగలిగే లేదా ఆఫ్ చేయగలిగే స్విచ్ ను కలిగి లేదు. భూమి గురుత్వాకర్షణ శక్తి దాని ద్రవ్యరాశి కారణంగా ఏర్పడుతుంది. భూమి బరువుగా ఉన్నంతకాలం దాని గురుత్వాకర్షణ శక్తి కొనసాగుతూనే ఉంటుంది. భూమికి ఉన్న గురుత్వాకర్షణను తొలగించాలంటే భూమిలో చాలా భాగం తొలగించాలి. అది సాధ్యం కానిది.

44
గురుత్వాకర్షణ తరంగాల వల్ల?
Image Credit : Getty

గురుత్వాకర్షణ తరంగాల వల్ల?

మరికొందరు ఈ వాదనను గురుత్వాకర్షణ తరంగాలతో ముడిపెడుతున్నారు. అయితే నిజానికి సైన్స్ చెబుతున్న ప్రకారం గురుత్వాకర్షణ తరంగాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని కొలవడం కూడా అంత సులభం కాదు. అవి మనుషులపై కానీ, భూమి గురుత్వాకర్షణపై కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదు. కాబట్టి ఈ వార్త పూర్తిగా అబద్ధం. ఇది మనుషులను తప్పుదోవ పట్టించడానికి ఎవరో సృష్టించినది. కాబట్టి ఆగస్టు 12న ఎలాంటి వింత జరగపోవడం లేదు. భూమి గురుత్వాకర్షణ కోల్పోదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Related Stories
Recommended image1
Bay leaf: బిర్యానీ ఆకును ఇంట్లో కాలిస్తే జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image2
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved