MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Sunday Traditions: ఆ ఊర్లో ఆదివారం నాడు మందు, మాంసం ముట్టరు.. ఎందుకో తెలుసా?

Sunday Traditions: ఆ ఊర్లో ఆదివారం నాడు మందు, మాంసం ముట్టరు.. ఎందుకో తెలుసా?

Sunday Traditions: సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామంది ఇళ్లలో చికెన్, మటన్ వాసనలు అదిరిపోతుంటాయి. ఇంకొందరైతే ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలు చేసుకుంటారు. కానీ తెలంగాణలోని ఒక ఊరిలో మాత్రం మందు, మాంసం ముట్టరు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Oct 21 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆదివారం మందు, మాంసం ముట్టని ఊరు
Image Credit : AI

ఆదివారం మందు, మాంసం ముట్టని ఊరు

ఆదివారం నాన్ వెజ్ తినడం, మందు తాగడం చాలామందికి సాధారణ అలవాటు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా గర్షకుర్తి గ్రామస్తులు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలని భావించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావంతో మొదలైన ఈ మార్పు ఇప్పుడు గ్రామ ప్రత్యేకతగా మారింది. ఇంతకీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి? అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ నిర్ణయం వెనుక కారణం
Image Credit : Gemini

ఈ నిర్ణయం వెనుక కారణం

గర్షకుర్తి గ్రామంలో ఆదివారం మాంసాహారం, మద్యం మానేయాలనే నిర్ణయం వెనుక ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్‌ ఇక్కడ మహాభారతంపై ప్రవచనాలు చేశారట. ఈ ప్రవచనాల్లో ఆదివారం ప్రాముఖ్యత, సూర్యభగవానుడి ఆరాధన, ఆధ్యాత్మిక నియమాల గురించి వివరించారట. ఆదివారం సూర్యభగవానుడికి అంకితమైన రోజుగా భావిస్తారని, ఆ రోజున నాన్ వెజ్, ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారట. ఆ ప్రవచనాలతో ప్రభావితమైన గ్రామస్తులు ప్రతి ఆదివారం మాంసాహారం, మద్యం తీసుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్నారట.

34
గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయం
Image Credit : Gemini AI

గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయం

ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామస్తులు తమ ఆచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలని భావించారట. అంతేకాకుండా, గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, వీధుల్లో ఈ నియమాన్ని తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేశారట. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంగా కాకుండా, గ్రామస్తులు అంతా కలిసి ఆచరించాలనుకున్న సామూహిక సంకల్పంగా ఈ మార్పు ప్రత్యేకతను సంతరించుకుంది.

44
ఆదివారం సూర్యభగవానుడికి ఎందుకు ప్రత్యేకం?
Image Credit : Pinterest

ఆదివారం సూర్యభగవానుడికి ఎందుకు ప్రత్యేకం?

హిందూ సంప్రదాయంలో ఆదివారం సూర్యభగవానుడికి సంబంధించిన రోజుగా భావిస్తారు. సూర్యుడిని శక్తి, ఆరోగ్యం, తేజస్సుకు ప్రతీకగా పూజిస్తారు. కొందరు ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఆచారాలను పాటిస్తారు. ఉపవాసం ఉండటం లేదా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం కూడా వ్యక్తిగత, కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. గర్షకుర్తి గ్రామస్తులు కూడా ఈ ఆధ్యాత్మిక భావనను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
తెలంగాణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetarian Village: మనదేశంలో ఒకే ఒక్క పూర్తి వెజిటేరియన్ గ్రామం.. మద్యం, మాంసం, గుడ్లు పూర్తిగా బ్యాన్
Recommended image2
Seafood Capital: మనదేశంలో సీ ఫుడ్ అంటే గుర్తొచ్చే సిటీ ఏదో తెలుసా? ఇక్కడి వంటలకు ప్రపంచమే దాసోహం
Recommended image3
కూర్చుని కాళ్లు ఊపితే దరిద్రం చుట్టుకుంటుందా? పెద్దలు చెప్పింది ఎంత వరకు నిజం?
Related Stories
Recommended image1
Post Office Schemes: పోస్టాఫీసులో టాప్ 5 బెస్ట్ స్కీమ్స్ ఇవే.. మీ డబ్బులు డబుల్!
Recommended image2
Telugu Saying: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved