MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Jeans: జీన్స్ ప్యాంటుకు జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో తెలుసా?

Jeans: జీన్స్ ప్యాంటుకు జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో తెలుసా?

Jeans: జీన్స్ ప్యాంట్ జేబుల మూలల్లో చిన్న చిన్న మెటల్ బటన్స్ కనిపిస్తుంటాయి. చాలామంది వాటిని కేవలం డిజైన్ కోసం పెట్టినవని అనుకుంటారు. కానీ దానికొక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఇంతకీ ఆ చిన్న బటన్స్ ఏంటి? జీన్స్‌కు వాటిని ఎందుకు అమర్చుతారు?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 13 2026, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీన్స్ జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో
Image Credit : Gemini AI

జీన్స్ జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో

జీన్స్ ప్యాంట్ జేబుల మూలల్లో చిన్న చిన్న మెటల్ బటన్స్ కనిపిస్తుంటాయి. చాలామంది వాటిని కేవలం డిజైన్ కోసం పెట్టినవని అనుకుంటారు. కానీ దానికొక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. జీన్స్ జేబుల మూలల్లో కనిపించే ఈ చిన్న మెటల్ బటన్స్‌ను రివెట్స్ (Rivets) అంటారు. ఇవి అలంకరణ కోసం కావు. జేబుల అంచులు, మూలల్లో త్వరగా చిరిగిపోకుండా ఉంచుతాయి.

జేబుల్లో చేతులు పెట్టడం, వస్తువులు తీసి పెట్టడం, వస్తువులను మోయడం వల్ల ఆ ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. కుట్టు ఊడిపోవడం లేదా చిరిగిపోవడం జరగొచ్చు. అలాంటి చోట్ల రివెట్స్‌ను అమర్చడం వల్ల క్లాత్ గట్టిగా ఉంటుంది. దీంతో చిరిగిపోదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీన్స్‌కు ఈ బటన్స్‌ను మొదట ఎందుకు పెట్టారు?
Image Credit : chat gpt

జీన్స్‌కు ఈ బటన్స్‌ను మొదట ఎందుకు పెట్టారు?

ఈ కథ 19వ శతాబ్దానికి చెందినది. అప్పట్లో గనుల్లో పనిచేసేవారు, కార్మికులు ఎక్కువగా గట్టి ప్యాంట్లను వాడేవారు. తరచూ పని చేయడం వల్ల ప్యాంట్ల జేబులు, కుట్టు దగ్గర చిరిగిపోయేది. దీంతో ఎక్కువ కాలం మన్నికగా ఉండే ప్యాంట్ల అవసరం ఏర్పడింది.

అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనోలో పనిచేసే జాకబ్ డేవిస్ అనే దర్జీ ఈ సమస్యకు సొల్యూషన్ గుర్తించారు. ప్యాంట్లలో ఒత్తిడి ఎక్కువగా పడే చోట లోహపు రివెట్స్‌ను అమర్చితే క్లాత్ బలంగా ఉంటుందని గుర్తించారు. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యాపారి లెవి స్ట్రాస్‌తో కలిసి ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. 1873 మే 20న వీరిద్దరూ ప్యాంట్లను లోహపు రివెట్స్‌తో చేసే ఈ పద్ధతికి అమెరికా పేటెంట్ పొందారు.

35
రాగితో తయారు చేసిన రివెట్స్
Image Credit : Gemini AI

రాగితో తయారు చేసిన రివెట్స్

మొదట్లో జీన్స్‌కు అమర్చిన రివెట్స్‌ను రాగితో తయారు చేసేవారు. రివెట్స్‌ను జేబుల మూలల్లో అమర్చడం వల్ల ఆ ప్రాంతాల్లో చిరిగిపోకుండా ఉండేది. అలా జీన్స్ తయారీ విధానాలు మారడంతో వివిధ లోహాలతో పాటు ఇతర పద్ధతులనూ ఉపయోగించడం ప్రారంభించారు. అయితే రివెట్స్ ఉన్నంత మాత్రాన జీన్స్ ఎప్పటికీ చిరగకుండా ఉంటుందని కాదు. బట్ట క్వాలిటీ, కుట్టు, వాడకం ఇలా అన్ని అంశాలపై మన్నిక ఆధారపడి ఉంటుంది.

45
కొన్ని జీన్స్‌లలో రివెట్స్ ఎందుకు కనిపించవు?
Image Credit : instagram

కొన్ని జీన్స్‌లలో రివెట్స్ ఎందుకు కనిపించవు?

ప్రతి జీన్స్ ప్యాంట్‌లోనూ బయటకు కనిపించే మెటల్ రివెట్స్ ఉండవు. కొన్ని కంపెనీలు వాటిని వస్త్రం లోపల ఉండేలా అమర్చుతాయి. మరికొన్ని బలమైన కుట్లు వేయడం వల్ల మన్నిక వస్తాయి.

ముఖ్యంగా వెనుక జేబుల దగ్గర బయటకు కనిపించే రివెట్స్ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. కుర్చీలు, ఫర్నిచర్ కు తగిలి గీతలు పడుతుంటాయి. కస్టమర్ల ఫిర్యాదుల వల్ల లెవి స్ట్రాస్ సంస్థ 1937లో వెనుక జేబుల రివెట్స్‌ను క్లాత్ తో కప్పడం ప్రారంభించింది. 1966 నాటికి వెనుక జేబులపై బయటకు కనిపించే రివెట్స్‌ను తొలగించింది. ఎందుకంటే అవి ఇతర వస్తువులను గీసుకోవడంతో పాటు క్లాత్ చిరిగిపోయేది.

55
ఇప్పటికీ జీన్స్‌లో రివెట్స్ ఎందుకు వాడుతున్నారు?
Image Credit : Gemini AI

ఇప్పటికీ జీన్స్‌లో రివెట్స్ ఎందుకు వాడుతున్నారు?

ప్రస్తుతం జీన్స్ తయారీలో బలమైన దారాలు, మెరుగైన కుట్టు పద్ధతులు, ఆధునిక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రతి జీన్స్‌కు రివెట్స్ తప్పనిసరి కాదు. అయినప్పటికీ జేబుల మూలల్లో గట్టిగా ఉంచడానికి వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. మరోవైపు, రివెట్స్ జీన్స్‌కు ప్రత్యేకమైన రూపాన్ని కూడా ఇచ్చాయి. మొదట కార్మికుల ప్యాంట్లు చిరిగిపోకుండా ఉండేందుకు రూపొందించిన ఈ లోహపు ముక్కలు, కాలక్రమేణా జీన్స్ డిజైన్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఎందుకు అవమానించారు? ఆనాడు బేగంపేట ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
Recommended image2
ఐర‌న్ చేసేప్పుడు దుస్తుల‌పై నీళ్లు ఎందుకు చ‌ల్లుతారు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Recommended image3
River: ఈ రెండు నదులు పక్కపక్కనే ప్రవహించినా కలవని నదులు ఇవి..!
Related Stories
Recommended image1
Tata Tiago Facelift: మైలేజ్ లో కింగ్, ఫీచర్స్ చూస్తే అదుర్స్..రూ.5లక్షల్లోపే టాటా టియాగో కొత్త వెర్సన్
Recommended image2
Dry Fish : ఎండు చేపల కోసం మార్కెట్ దాకా వెళ్లక్కర్లేదు..ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved