MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Facts : ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

Facts : ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!

పక్షులు ఏరోడైనమిక్స్ ను ఫాలో అవుతాయా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణగా పక్షుల గుంపు V ఆకారంలో ప్రయాణించడమే అంటున్నారు. అసలు ఇందులో దాగున్న సైన్స్ ఏంటో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 30 2026, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పక్షులు ఎందుకు V ఆకారంలో ఎగురుతాయి?
Image Credit : Gemini AI

పక్షులు ఎందుకు V ఆకారంలో ఎగురుతాయి?

ఆకాశంలో పక్షుల గుంపు ఎగిరేటప్పుడు గమనించారా? అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ప్రయాణించడం కనిపిస్తుంది. అయితే ఎక్కువగా పక్కుల గుంపు ఇంగ్లీష్ అక్షరం 'V' ఆకారంలో ఎగురుకుంటూ వెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ దృశ్యం వెనుక కేవలం క్రమశిక్షణ మాత్రమే లేదు అద్భుతమైన శాస్త్రీయ రహస్యం (Science) దాగి ఉంది. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వలస పక్షులు ఈ ప్రత్యేకమైన ఆకారాన్ని ఎందుకు ఎంచుకుంటాయి... దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ‘ఏరోడైనమిక్స్’ పక్షులకెలా తెలుసబ్బా..!
Image Credit : Gemini AI

‘ఏరోడైనమిక్స్’ పక్షులకెలా తెలుసబ్బా..!

వలస పక్షులు 'V' ఆకారంలో ఫార్మ్ అయి ఎగరడానికి ముఖ్యమైన కారణం గాలి ఒత్తిడిని తగ్గించుకోవడమే. గాలిని చీల్చుకుంటూ వేగంగా ముందుకు వెళ్లేందుకు పక్షులు 'ఏరోడైనమిక్స్' ను ఫాలో అవుతాయి. ఈ గుంపులో ముందు ఎగిరే లీడర్ పక్షి గాలిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంది... ఒత్తిడినంతా భరిస్తూ మిగతా పక్షులకు శ్రమ తగ్గిస్తుంది. ఇలా సైన్స్ ను ఉపయోగించడం వల్లే కొన్ని పక్షుల గుంపులు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

V ఆకారంలో ఫార్మ్ అయి ఎగిరే సమయంలో ముందుండే లీడర్ పక్షి తన రెక్కలను ఎక్కువగా పైకీ కిందికీ ఆడిస్తుంటుంది. దీంతో దాని రెక్కల చివరల నుండి గాలి పైకి లేస్తుంది... దీనిని సైన్స్ భాషలో 'అప్‌వాష్' (Upwash) అంటారు. అయితే వెనుక వచ్చే పక్షి, ముందున్న పక్షి సృష్టించిన ఈ 'అప్‌వాష్' గాలి ప్రవాహంలో సరిగ్గా అమరిపోతుంది. దీనివల్ల వెనుకున్న పక్షికి ప్రకృతి సిద్ధంగానే పైకి లేచే బలం (Lift) లభిస్తుంది. ఫలితంగా అది తక్కువ శ్రమతో ఎక్కువ దూరం ఎగరగలుగుతుంది.

35
2. పక్షుల శక్తి పొదుపు సీక్రెట్ ఇదే...
Image Credit : Pixabay

2. పక్షుల శక్తి పొదుపు సీక్రెట్ ఇదే...

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం... పక్షులు ఒంటరిగా ఎగిరే దానికంటే ఇలా 'V' ఆకారంలో సమూహంగా ఎగరడం వల్ల దాదాపు 70% పైగా శక్తిని పొదుపు చేయగలవట. ఇంకా ఆసక్తికరమైన నిజం ఏంటంటే ఇలా V ఆకారంలో ఎగిరేటప్పుడు పక్షుల గుండె కొట్టుకునే వేగం (Heart rate) చాలా తక్కువగా ఉంటుందట. అవి తక్కువ సార్లు రెక్కలు ఆడిస్తూ, గాలిలోనే తేలుతూ (Gliding) ప్రయాణాన్ని సాగిస్తాయి కాబట్టి శరీరంపై భారం పడదు.. అందుకే గుండె వేగం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

45
3. పక్షుల టీమ్‌వర్క్ వేరే లెవెల్
Image Credit : Pixabay

3. పక్షుల టీమ్‌వర్క్ వేరే లెవెల్

'V' ఆకారంలో ప్రయాణించేటప్పుడు అందరికంటే ముందుండే పక్షిపై గాలి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది... అందువల్ల ఆ పక్షి త్వరగా అలసిపోతుంది. కానీ వెనకాల ఉండే పక్షులు మాత్రం అలసట లేకుండానే ఎగరగలుగుతాయి. ఎప్పుడైతే లీడర్ పక్షి అలసిపోతుందో, అది వెంటనే తన స్థానాన్ని మార్చుకుని గుంపులో వెనుక వైపునకు వెళ్తుంది. మరో బలమైన పక్షి ముందుకు వచ్చి నాయకత్వాన్ని తీసుకుంటుంది. ఈ విధంగా గ్రూప్‌లోని పక్షులన్నీ వంతులవారీగా లీడర్‌గా వ్యవహరిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి. వీటిలో స్వార్థం లేని నిజమైన టీమ్‌వర్క్ కనిపిస్తుంది.

55
4. పక్షుల కమ్యూనికేషన్ అదుర్స్ కదూ..!
Image Credit : Pixabay

4. పక్షుల కమ్యూనికేషన్ అదుర్స్ కదూ..!

పక్షులు 'V' ఆకారంలో ఎగరడం వల్ల ప్రతి పక్షికి తన ముందున్న పక్షి స్పష్టంగా కనిపిస్తుంది... కాబట్టి ప్రయాణంలో ఏ పక్షి కూడా దారి తప్పిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా పక్షి అలసట వల్లో లేదా గాయపడటం వల్లో కిందకు పడిపోతే, దానికి తోడుగా మరో రెండుమూడు పక్షులు కూడా కిందకు దిగుతాయి. అది కోలుకునే వరకు రక్షణగా ఉండి, ఆ తర్వాత వేరే గుంపుతో కలిసి ప్రయాణిస్తాయి. ఇలా పక్షులు అద్భుతమైన కమ్యూనికేషన్ కలిగివుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రకృతి మనకు నేర్పించే ఇంజనీరింగ్ పాఠాలకు వలస పక్షుల ప్రయాణమే ఒక గొప్ప ఉదాహరణ. పక్షుల ఈ 'V' షేప్ ఏరోడైనమిక్స్ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే నేడు మిలిటరీ ఫైటర్ జెట్స్ కూడా ఇంధనాన్ని ఆదా చేయడానికి ఆకాశంలో ఇదే ఆకారంలో ప్రయాణిస్తుంటాయి. పక్షుల ఈ సహజసిద్ధమైన తెలివితేటలు నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి కదూ!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
ప్రపంచాన్ని చుట్టేసే పక్షులు: ఏటా 70,000 కిమీ ప్రయాణం.. ఏవో తెలుసా?
Recommended image2
మగాళ్లంటే ఓకే.. పక్షులు కూడా ఆడాళ్ళను చూసి వణికిపోతాయట.. ఎందుకో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved