MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Facts: అమెరికన్లకు గ్యాస్ సిలిండర్ల టెన్షనే ఉండదు.. మరి గ్యాస్ ఎలా వాడాతారు? ప్రతినెలా బుక్ చేసుకునే అవసరమే రాదా?

Facts: అమెరికన్లకు గ్యాస్ సిలిండర్ల టెన్షనే ఉండదు.. మరి గ్యాస్ ఎలా వాడాతారు? ప్రతినెలా బుక్ చేసుకునే అవసరమే రాదా?

 Facts: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? ప్రతి నెల, రెండు నెలలకు ఒకసారి గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా? కానీ.. అమెరికన్లు కనీసం సిలిండర్ల ముఖం కూడా చూడరని మీకు తెలుసా? మరి వారికి గ్యాస్ సప్లై ఎలా జరుగుతుందో తెలుసోవాలా ఇది చదివేయండి.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2026, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అమెరికన్లకు గ్యాస్ సమస్య రాదా?
Image Credit : ChatGpt

అమెరికన్లకు గ్యాస్ సమస్య రాదా?

అక్కడెక్కడో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం మన వంటింటిపై పడింది. సరిగ్గా గ్యాస్ కూడా దొరకలేదు. చాలా మంది ఈ గ్యాస్ ప్రాబ్లమ్ మన దగ్గర హోటల్స్ మూసేసిన వాళ్లు కూడా ఉన్నారు. కొంతకాలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లై కూడా ఆపేశారు. కేవలం.. ఇంటికి కూడా చాలా మందికి సిలిండర్ దొరకలేదు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటికీ.. ఈ షార్టేజ్ కొంత కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే.. మనకు వచ్చిన ఈ ప్రాబ్లం అమెరికన్స్ కి కూడా వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే.. వారికి మనలాగా..సిలిండర్లే ఉండవు. మరి.. సిలిండర్స్ లేకుండా వాళ్లు గ్యాస్ ఎలా వాడతారు? అసలు గ్యాస్ బుక్ చేసుకునే పద్దతి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గ్యాస్ ఎలా వాడతారు?
Image Credit : Chat GPT

గ్యాస్ ఎలా వాడతారు?

భారత దేశంలో ప్రతి ఇంట్లో LPG సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ అయిపోతే మళ్లీ బుక్ చేసుకుంటాం. కానీ అమెరికాలో మాత్రం ఇలా ఉండదు. అక్కడ వారికి ప్రతి నెలా గ్యాస్ బుక్ చేసుకునే అవసరమే రాదు. ఎందుకంటే.. అక్కడ ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. అంటే గ్యాస్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా ఇంటికి పైప్ కనెక్షన్ ఉంటుంది. అది కూడా.. భూమిలోపల నుంచే ఆ కనెక్షన్ ఉంటుంది. ఆ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అవుతుంది. అందుకే.. వాళ్లకు సరపేటుగా.. ప్రతి నెలా గ్యాస్ బుక్ చేసుకోవాలి అనే టెన్షన్ ఉండదు. అలా అని ఫ్రీగా ఈ సరఫరా ఉండదు. ప్రతి ఇంటికి మనకు కరెంట్ బిల్లు చెక్ చేసే మీటర్ ఉన్నట్లే.. వారికి గ్యాస్ కి కూడా ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ ద్వారా.. గ్యాస్ బిల్లు పే చేయాల్సి ఉంటుంది. ఎంత వాడితే అంత పే చేస్తే సరిపోతుంది. అంటే.. మన దేశంలో లాగా.. సడెన్ గా గ్యాస్ అయిపోయింది అనే టెన్షన్ పడే అవసరం ఉండదు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అసవరం కూడా ఉండదు.

Related Articles

Related image1
Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?
Related image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
33
గ్యాస్ వంటకు మాత్రమే కాదు..
Image Credit : Gemini AI

గ్యాస్ వంటకు మాత్రమే కాదు..

మనం వంట గ్యాస్ ని చాలా పొదుపుగా వాడుకుంటూ ఉంటాం. కేవలం వంటకు మాత్రమే వాడతాం.కానీ, అమెరికాలో కేవలం వంటకు మాత్రమే కాకుండా.. చాలా రకాల పనులకు ఈ గ్యాస్ నే వాడతారు. చలికాలంలో అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది కదా.. ఆ చలి నుంచి తట్టుకోవడానికి, ఇంటిని వేడిగా ఉంచడానికి హీటింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు. అది కూడా గ్యాస్ తోనే పని చేస్తుంది. అదే కాదు.. వాటర్ హీటర్, డ్రెయ్యర్ మెషిన్లు లాంటివి కూడా వీరికి గ్యాస్ తోనే పని చేస్తాయి.

గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి..?

అమెరికాలోని సిటీల్లో మొత్తం ఇలా గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. కానీ, గ్రామీణ ప్రాంతాలకు మాత్రం ఇలా పైప్ లైన్ సర్వీస్ ఉండదు. అలా అని వాళ్లకు మనలాగా గ్యాస్ సిలిండర్లు ఉండవు. వారి కోసం స్పెషల్ గా కొన్ని ట్యాంక్స్ ఏర్పాటు చేస్తారు. అవి చిన్నగా ఏమీ ఉండవు. మన వాటర్ ట్యాంకర్ల మాదిరి పెద్దగా ఉంటాయి. తెల్లటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా వారికి కనెక్షన్ ఇస్తారు. ఆ ట్యాంకుల్లో కొన్ని వందల గ్యాలన్ల గ్యాస్ ఉంటుంది. అందులో గ్యాస్ తగ్గినప్పుడే కంపెనీ స్వయంగా వచ్చి ట్యాంక్ ఫుల్ చేసి వెళ్లిపోతుంది. దాదాపు సంవత్సరానికి ఒకసారి రీఫిల్ చేసే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?
Recommended image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved