MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Feature
  • India vs USA : మనలా అమెరికాలో ఇళ్లకు గేట్లు, కాంపౌండ్ వాల్స్ ఉండవు.. ఎందుకో తెలుసా?

India vs USA : మనలా అమెరికాలో ఇళ్లకు గేట్లు, కాంపౌండ్ వాల్స్ ఉండవు.. ఎందుకో తెలుసా?

మన దగ్గర ఇంటిముందు అంగుళం జాగా ఉన్నా సరే చుట్టూ కంచె వేసి 'ఇది నాది' అని బోర్డు పెట్టేస్తాం. కానీ అమెరికాలో ఇళ్లకు గేట్లు, కాంపౌండ్ వాల్స్ అస్సలు కనిపించవు. రోడ్డు పక్కనే పచ్చిక బయలు, ఆ వెంటనే ఇల్లు. ఇలా ఎందుకుంటాయో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 25 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 అమెరికా ఇళ్లకు గేట్లు ఎందుకుండవు..?
Image Credit : Gemini AI

అమెరికా ఇళ్లకు గేట్లు ఎందుకుండవు..?

అమెరికా ఆర్థికంగానే కాదు సామాజికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశం… అందుకే దీన్ని ‘అగ్రరాజ్యం’' అంటారు. ఇక్కడి ప్రజలు చాలా క్రమశిక్షణ కలిగివుంటారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి నివాసముండే ఇంటి విషయంలో వీళ్లు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అమెరికా ప్రభుత్వం కూడా ఇళ్ల విషయం కఠిన నిబంధనలు అమలుచేస్తుంది. 

సాధారణంగా అమెరికాలోని ప్రతి కాలనీకి 'హోమ్ ఓనర్స్ అసోసియేషన్' (HOA) అనే ఓ కమిటీ ఉంటుంది. వీళ్ల రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. పక్కపక్క ఇళ్లన్నీ ఒకేలా అందంగా కనిపించాలని వీళ్లు కోరుకుంటారు. అందుకే ఇళ్ల అందాన్ని పాడుచేసే గేట్లు, కాంపౌండ్లు కట్టనివ్వరు… అలాగని సెక్యూరిటీని గాలికి వదిలేయరు.. చాలా కఠినంగా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెరికాలో సేఫ్ లివింగ్ స్టైల్..
Image Credit : instagram

అమెరికాలో సేఫ్ లివింగ్ స్టైల్..

భారత్‌తో పోలిస్తే అమెరికాలో దొంగతనాలు, నేరాలు చాలా తక్కువ. అక్కడ గన్ కల్చర్ ఎక్కువే.. కానీ వీటిని తమ వ్యక్తిగత రక్షణకు మాత్రమే వాడుకుంటారు. ఇక ఇక్కడి పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. దానికి తోడు ప్రతిచోటా సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ అలారమ్స్, స్మార్ట్ డోర్ బెల్స్ ఉంటాయి. అందుకే అక్కడి ఇళ్లకు గేట్లు, ప్రహరీ గోడలు వంటివి అవసరం ఉండదు. 

Related Articles

Related image1
House Cooling Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లబడాలా? ఇదొక్కటి చేస్తే చాలు
Related image2
Smriti Mandhana House : SM 18 ఇల్లు కాదు మరో ఇంద్రభవనమే.. మంధాన మరో ప్రపంచం ఇదే..!
35
సామాజిక కారణాలు..
Image Credit : instagram

సామాజిక కారణాలు..

అమెరికన్లు స్వేచ్ఛకు, విశాల దృక్పథానికి (Openness) ఎక్కువ విలువిస్తారు. ఇంటి ముందు గేటు లేదా కాంపౌండ్ కడితే పక్కింటి వాళ్లతో తమనుతాము వేరు చేసుకున్నట్లుగా భావిస్తారు. దాన్ని వాళ్లు అనాగరికంగా కూడా చూస్తారు. అందుకే ఇంటిముందు గేట్లు ఉండవు. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు మాత్రం సెక్యూరిటీ రీజన్స్ తో కాంపౌండ్ వాల్స్ కట్టుకుంటారు.. ఇలాంటి ఇళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 

45
 ఇళ్లను చెక్కతో నిర్మించడం..
Image Credit : instagram

ఇళ్లను చెక్కతో నిర్మించడం..

అమెరికాలో ఇండ్లు చెక్కతో నిర్మిస్తారు. కాబట్టి ఇంట్లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు గేట్లు అడ్డంకిగా మారకుండా ముందుజాగ్రత్త పడతారు. ఉదాహరణకు ఇంట్లో మంటలు చెలరేగినా, ఎవరికైనా ఆరోగ్యం పాడైనా… ఎమర్జెన్సీ వెహికిల్స్ వేగంగా వచ్చి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉండాలి. అందుకే రోడ్లను ఆనుకునే ఇళ్లు ఉన్నా గేట్లు, కాంపౌండ్ వాల్స్ ఉండవు.  

ఇక అమెరికాలో ఆన్ లైన్ షాపింగ్ కల్చర్ కూడా ఎక్కువే. కాబట్టి ఇంటిముందు గేట్లు, గోడలు లేకుంటేనే పార్శిల్ డెలివరీ సులభం. ఇక్కడ రోడ్డు పక్కనే ఉండే పోస్ట్ బాక్సుల్లో లేదా ఇంటి ముందు గుమ్మం దగ్గర పార్శిల్స్ వదిలి వెళుతుంటారు. 

55
 అమెరికాలో కఠిన నిబంధనలు..
Image Credit : Youtube

అమెరికాలో కఠిన నిబంధనలు..

అమెరికాలో ఇళ్ల డిజైన్‌కు కొన్ని నియమాలుంటాయి. ఇంటి ముందు భాగం ఎలా ఉండాలి, వెనుక భాగం ఎలా ఉండాలనే దానిపై ముందే స్పష్టత ఉంటుంది. నిబంధనలు పాటించకుండా ఇంటిని నిర్మిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారు. అందుకే ప్రతిఒక్కరు రూల్స్ ఫాలో అవుతూనే ఇళ్ళు కట్టుకుంటారు.

ఇంటిముందు కాంపౌండ్ వాల్ కట్టుకోడానికి అనుమతి ఉండదు… కానీ ఇంటి వెనుక మాత్రం చెక్క లేదా ప్లాస్టిక్ కంచెలు వేసుకుంటారు. ఇంటి వెనకాల చిన్నచిన్న చెట్లు ఉంటాయి, కూరగాయలు, పండ్లు పెంచుకోవచ్చు. వీటికి రక్షణగా తాత్కాలికంగా రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇష్ట‌మైన ఆహారం చూడ‌గానే, నోటిలో లాలాజ‌లం ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే
Recommended image2
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image3
Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Related Stories
Recommended image1
House Cooling Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లబడాలా? ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image2
Smriti Mandhana House : SM 18 ఇల్లు కాదు మరో ఇంద్రభవనమే.. మంధాన మరో ప్రపంచం ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved