MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Smriti Mandhana House : SM 18 ఇల్లు కాదు మరో ఇంద్రభవనమే.. మంధాన మరో ప్రపంచం ఇదే..!

Smriti Mandhana House : SM 18 ఇల్లు కాదు మరో ఇంద్రభవనమే.. మంధాన మరో ప్రపంచం ఇదే..!

ఇండియన్ ఉమెన్స్ టీం స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ స్మృతి మంధాన ఇంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయటి నుంచి చూస్తే ఇంద్రభవనంలా కనిపించే ఈ ఇంటి లోపల ఎలా ఉందో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 01 2026, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్మృతి మంధాన ప్యాలెస్...
Image Credit : Instagram

స్మృతి మంధాన ప్యాలెస్...

స్మృతి మంధాన… క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ని కింగ్ కోహ్లీతో పోలుస్తుంటారు… దీన్నిబట్టే ఈ బ్యాట్ నుండి పరుగుల వరద  ఏ స్థాయిలో పారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆటలోనే కాదు లగ్జరీ లైఫ్ స్టైల్ లో కోహ్లీకి ఏమాత్రం తీసిపోదు మందానా… ఆమె విలాసవంతమైన ఇంటిని చూస్తేనే ఈ విషయం చెప్పేయొచ్చు. 

స్మృతి మంధాన మహారాష్ట్రకు చెందిన క్రికెటర్…  ఈమె స్వస్థలం సాంగ్లీ. తాను పుట్టిపెరిగిన ప్రాంతంలో స్మృతి రాజభవనంలాంటి ఇంటిని నిర్మించుకుంది. ఈ ఇల్లు బయటినుండి ఎంత రాజసంగా ఉంటుందో లోపల అంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఎంట్రెన్స్ లోనే ఆమె పేరు, జెర్సీ నంబర్‌తో 'SM 18' అని రాసి ఉంది… ఇది ఆ ఇంటికి మరింత అందాన్ని, సరికొత్త లుక్ ని ఇస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అందమైన లివింగ్ రూమ్..
Image Credit : Insta/Smriti Mandhana

అందమైన లివింగ్ రూమ్..

లివింగ్ రూమ్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. గదిలో ఒకవైపు కిటికీలకు ఎదురుగా పెద్ద బ్రౌన్ కలర్ సోఫా ఉంది. దాని పక్కనే ఒక వుడెన్ ల్యాంప్ ఉంది. ఈ ప్రశాంతమైన ప్రదేశంలోనే స్మృతి కుటుంబంతో కలిసి సరదాగా మాట్లాడుకోవడం, క్రికెట్ మ్యాచ్‌లు చూడటం, హాయిగా సేద తీరడం చేస్తుంటారు.

36
ట్రోఫీల గోడ...
Image Credit : cosmopolitan

ట్రోఫీల గోడ...

స్మృతి ఇంట్లో ఒక గది గోడ మొత్తం పెద్ద క్యాబినెట్‌తో నిండిపోయింది. అందులో స్మృతి మంధాన గెలుచుకున్న ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహుమతులు, పతకాలు అన్నీ ఉన్నాయి. ఈ షెల్ఫ్‌లను చాలా చక్కగా విభజించి, నీట్‌గా సర్దారు.
46
వాక్-ఇన్ వార్డ్‌రోబ్
Image Credit : insta/Smriti Mandhana

వాక్-ఇన్ వార్డ్‌రోబ్

ఇంట్లో అందమైన వాక్-ఇన్ వార్డ్‌రోబ్ కూడా ఉంది. ఇందులో జాకెట్లు, షర్టులు, క్యాజువల్ దుస్తులను వేర్వేరుగా సర్దారు. కింద భాగంలో స్పోర్ట్స్ షూస్ కోసం ఒక షూ ర్యాక్ ఉంది. వార్డ్‌రోబ్ ఫ్రేమ్‌లోనే కూర్చొని బట్టలు ఎంచుకోవడానికి వీలుగా ఒక చిన్న సీటింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు.
56
స్మృతి మంధాన బెడ్‌రూమ్
Image Credit : cosmopolitan

స్మృతి మంధాన బెడ్‌రూమ్

స్మృతి మంధాన బెడ్‌రూమ్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. వుడెన్ ఫ్లోర్‌కు మ్యాచింగ్‌గా బ్రౌన్ కలర్ బెడ్ ఉంది. పక్కనే టేబుల్‌పై కొన్ని 'షిన్‌చాన్' కార్టూన్ బొమ్మలు ఉన్నాయి. బెడ్ పైన స్మృతి మంధాన ఫోటో ఫ్రేమ్ ఉంది. వార్డ్‌రోబ్ డోర్లకు పసుపు, తెలుపు రంగు ప్యానెల్స్ ఉన్నాయి. అక్కడ ఒక క్రికెట్ బ్యాట్ కూడా కనిపిస్తుంది.

66
స్మృతి హోమ్ జిమ్, స్విమ్మింగ్ పూల్
Image Credit : Instagram

స్మృతి హోమ్ జిమ్, స్విమ్మింగ్ పూల్

ఆమె హోమ్ జిమ్‌లో బెంచ్ ప్రెస్ సెటప్, డంబెల్స్, ప్లేట్లు, సైక్లింగ్ ట్రైనర్, మ్యాట్స్ వంటి పరికరాలు ఉన్నాయి. అంతేకాదు స్మృతి మంధాన ఇంట్లో అందమైన ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆమె ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు చాలా సమయం ఈ జిమ్, స్విమ్మింగ్ పూల్ లో గడుపుతారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
మహిళలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !
Recommended image3
IND vs WI: వెస్టిండిస్ సంచ‌ల‌న విజ‌యం.. చివ‌రి వ‌న్డేలో చెల‌రేగిన హోప్ సేన
Related Stories
Recommended image1
Smriti Mandhana : 2025 రన్ మెషీన్.. గిల్ కు స్మృతి మంధాన షాక్ !
Recommended image2
Smriti Mandhana : ఏకంగా రిజర్వ్ బ్యాంకునే పట్టిందిగా.. రిచెస్ట్ ఉమెన్ క్రికెటర్ ఉద్యోగమూ రిచ్చే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved