MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Facts : వారం రోజులు ఊపిరి తీసుకోకున్నా బ్రతికే జీవి ఏది? వీటిని మన ఇళ్లలో చూస్తుంటాం

Facts : వారం రోజులు ఊపిరి తీసుకోకున్నా బ్రతికే జీవి ఏది? వీటిని మన ఇళ్లలో చూస్తుంటాం

ఏమిటీ..! సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు కాదు ఏకంగా వారంపాటు ఊపిరి తీసుకోకుండా బతికే జీవులు కూడా ఈ భూమిపై ఉన్నాయా..! ఇలాంటి ఓ జీవి మన ఇళ్లలోనూ కనిపిస్తుంది. అదేంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తేళ్లు ఇంత ప్రత్యేకమా..!
Image Credit : Gemini AI

తేళ్లు ఇంత ప్రత్యేకమా..!

ఒక్కపూట అహారం లేకుంటేనే మనిషి అల్లాడిపోతాడు... రెండుమూడు రోజులు తినకుంటే పేషెంట్ లా మారిపోతాడు. అదే ఓ పది ఇరవైరోజులు ఫుడ్ లేకుంటే ప్రాణాలే పోతాయి. మనిషే కాదు చాలా జంతువులు అహారం లేకుండా ఎక్కువరోజులు జీవించలేవు. కానీ భూమిపై ఓ జీవి మాత్రం సంవత్సరం పాటు అహారం లేకుండా జీవించగలదట... ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారం రోజులపాటు అసలు శ్వాస తీసుకోకున్నా బ్రతుకుతుందట. ఇంతకూ ఆ జీవి ఏది? దాని జీవనవిధానం ఎందుకంత ప్రత్యేకంగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తేళ్లు అహారం కాదు అసలు గాలికూడా పీల్చకుండా బ్రతుకుతాయా..!
Image Credit : stockPhoto

తేళ్లు అహారం కాదు అసలు గాలికూడా పీల్చకుండా బ్రతుకుతాయా..!

తేలు... ఇది సహజంగా ఇళ్లలో, పొలాలవద్ద, బండరాళ్లకింద కనిపించే చిన్న జీవి. ఇది విషపూరితమైనదే అయినప్పటికీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కాదు. అయితే సాధారణంగా చీమల నుండి పాముల వరకు ఏ జీవి, దేన్ని ఎక్కువగా తింటుందో మనకు తెలుసు... కానీ తేళ్లు ఏం తింటాయి? అంటే సమాధానం ఉండదు. అయితే తేళ్లు అహారం కోసమే జీవించే జీవులు కావు... ఇవి ఫుడ్ లేకుండా ఏకంగా ఒక సంవత్సరం పాటు జీవిస్తాయి.

తేళ్ళలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఇవి ఊపిరి పీల్చుకోకుండా ఆరు రోజుల వరకు బతకగలవట. భూమి మీద అత్యంత కఠినమైన వాతవారణ పరిస్థితులను కూడా తట్టుకుని బ్రతుకుతాయి ఈ తేళ్లు. నీటిలో మునిగినా లేదా ప్రమాదకరమైన వాయువులు విడుదలైన సమయంలో తేళ్లు శ్వాస రంధ్రాలను (స్పైరాకిల్స్) మూసివేస్తాయి... పరిస్థితులు చక్కబడే వరకు ఇలా ఊపిరి తీసుకోకుండా ఉండగలవు. ఇలా నిమిషాలు, గంటలు, రోజులు కాదు... గరిష్ఠంగా ఆరేడు రోజులపాటు గాలి పీల్చుకోకుండా జీవిస్తుంటాయి తేళ్లు.

35
ఊపిరి తీసుకోకుండా తేళ్ళు ఎలా బతుకుతాయి?
Image Credit : stockPhoto

ఊపిరి తీసుకోకుండా తేళ్ళు ఎలా బతుకుతాయి?

మనుషులు, ఇతర జంతువుల మాదిరిగా తేళ్లలో ఊపిరితిత్తులు ఉండవు... బదులుగా 'బుక్ లంగ్స్' (Book Lungs) అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఇవి తేలు శరీరంలో పొరలు పొరలుగా ఉంటాయి. ఈ ప్రత్యేక నిర్మాణం వల్ల తేళ్లు తమ శ్వాసక్రియ వేగాన్ని బాగా తగ్గించుకుంటాయి. దీంతో ఆక్సిజన్ వాడకం తగ్గి, ఎక్కువసేపు ఊపిరి లేకుండా బతకగలుగుతాయి.

45
తేళ్లు అహారం లేకున్నా ఎలా బతుకుతాయి?
Image Credit : stockPhoto

తేళ్లు అహారం లేకున్నా ఎలా బతుకుతాయి?

తేళ్ల జీవక్రియ (Metabolism) చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్లే అవి ఎక్కువ రోజుల పాటు ఆహారం తీసుకోకున్నా జీవించగలవు. తమ శక్తిని ఆదా చేసుకోవడానికి, ఈ జీవులు తమ కదలికలను కూడా తగ్గించుకుంటాయి.

తేళ్లలో మరో వింత లక్షణం ఉంది. ఇవి అతినీలలోహిత కాంతిలో (UV Lights) నీలం లేదా ఆకుపచ్చ రంగులో మెరుస్తాయి. తేళ్ల శరీర నిర్మాణమే ఈ మెరుపుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

55
తేళ్లది 40 కోట్ల సంవత్సరాల చరిత్ర
Image Credit : Getty

తేళ్లది 40 కోట్ల సంవత్సరాల చరిత్ర

తేళ్లు చాలా పురాతన జీవులు…. శిలాజాల ఆధారంగా ఇవి భూమిపై 400 మిలియన్ (40 కోట్ల) సంవత్సరాల నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాజీవ శాస్త్రవేత్తలు (Paleontologists) సిలూరియన్ కాలం నాటి శిలాజాలలో తేళ్ల ఆనవాళ్లను కనుగొన్నారు. ఇవి అత్యంత పురాతన అరాక్నిడ్ వంశానికి చెందినవి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Interesting Facts: అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు.. అసలు బతకలేదు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Facts : హిప్పో చెమట ఎర్రగా ఉంటుందా..! 'బ్లడ్ స్వెట్' నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved