MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Pink Lake: ప్రపంచంలోనే అందమైన పింక్ సరస్సు ఎక్కడుంది? ఆ నీరు గులాబీ రంగులో ఉండటానికి కారణం ఏంటి?

Pink Lake: ప్రపంచంలోనే అందమైన పింక్ సరస్సు ఎక్కడుంది? ఆ నీరు గులాబీ రంగులో ఉండటానికి కారణం ఏంటి?

Pink Lake: ప్రపంచంలో ఎక్కడ చూసినా మంచి నీటి, ఉప్పునీటి సరస్సులు లెక్కలేనన్ని కనిపిస్తుంటాయి. అవి నీలి, ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తుంటాయి. కానీ ఓ సరస్సు మాత్రం పింక్ కలర్ లో అందంగా కనిపిస్తు అబ్బురపరస్తుంది. ఇంతకీ ఆ అందమైన పింక్ లేక్ ఎక్కడుంది?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 28 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కోట్ల సరస్సుల్లో ఇది ప్రత్యేకం..
Image Credit : ChatGPT

కోట్ల సరస్సుల్లో ఇది ప్రత్యేకం..

ఈ భూమి మీద కొన్ని కోట్ల సంఖ్యలో సరస్సులు ఉన్నాయి. దాదాపు అన్ని సరస్సులలో నీలి రంగు కానీ, ఆకుపచ్చ రంగు, గోధుమ రంగులో నీరు కనిపిస్తుంటుంది. కొన్ని స్వచ్చమైన తాగు నీరు కలిగిన సరస్సులు కూడా ఉన్నాయి. కానీ గులాబీ రంగు నీరు కలిగిన అందమైన పింక్ లేక్ గురించి మీకు తెలుసా? పింక్ లేక్ లు ఎన్నో ఉన్నా.. ఇంత అంతమైన పింక్ లేక్ ను మీరు చూసి ఉండారు. ఆస్ట్రేలియాలోని హిల్లియర్ సరస్సు (Lake Hillier) ప్రకృతి ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటి. ముఖ్యంగా ఆకాశం నుంచి తీసిన చిత్రాల్లో దీని నీరు పింక్ రంగులో స్పష్టంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రత్యేకతతో పాటు, సరస్సులో అధిక మొత్తంలో ఉప్పు ఉండటం కూడా విశేషం.

పింక్ లేక్ ఎక్కడుంది?

హిల్లియర్ సరస్సు సుమారు 600 మీటర్ల (2,000 అడుగులు) పొడవు- సుమారు 250 మీటర్ల (820 అడుగులు) వెడల్పు ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ ఇసుక దిబ్బలు , పేపర్‌బార్క్ , యూకలిప్టస్ చెట్లతో కూడిన దట్టమైన అడవులు ఉన్నాయి. హిల్లియర్ సరస్సు పశ్చిమ ఆస్ట్రేలియా దక్షిణ తీరానికి సమీపంలోని రషెర్చే ద్వీపసమూహంలో (Recherche Archipelago) ఉంది.

ఈ ద్వీపసమూహంలోని అతిపెద్ద ద్వీపం మిడిల్ ఐలాండ్ (Middle Island). జనావాసాలు లేని ఈ ద్వీపం ప్రకృతి సంరక్షణ ప్రాంతంగా ఉంది. ఇక్కడ దట్టమైన యూకలిప్టస్ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తొలిసారిగా మ్యాప్‌లో గుర్తించిన వారిలో బ్రిటిష్ అన్వేషకుడు మాథ్యూ ఫ్లిండర్స్ (Matthew Flinders) ముఖ్యుడు. ఆయన హెచ్‌ఎంఎస్ ఇన్వెస్టిగేటర్ (HMS Investigator) అనే నౌకకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హిల్లియర్ సరస్సుకు ఆ పేరు ఎలా వచ్చింది?
Image Credit : terhunetravels

హిల్లియర్ సరస్సుకు ఆ పేరు ఎలా వచ్చింది?

మాథ్యూ ఫ్లిండర్స్ తన జర్నీ డైరీలో ఆ సరస్సును గులాబీ రంగులో ఉన్న చిన్న సరస్సుగా వర్ణించారు. తర్వాత ఆయన తన నౌకలో పనిచేసిన విలియం హిల్లియర్ (William Hillier) పేరును ఆ సరస్సుకు పెట్టారు. మిడిల్ ఐలాండ్ వద్ద నౌక నిలిపి ఉంచిన సమయంలో అనారోగ్యం వల్ల తన నౌకలో పనిచేసిన విలియం హిల్లియర్ మరణించారు. ఆయన జ్ఞాపకార్థంగానే ఈ సరస్సుకు హిల్లియర్ అనే పేరు వచ్చింది. అయితే ఆ సరస్సును మరింత పరిశీలించిన నౌక సిబ్బందికి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. దాని నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంది. అది డెడ్ సీ (Dead Sea)లో ఉండే లవణీయతకు దాదాపు సమానంగా ఉందని వారు గుర్తించారు. దీంతో సిబ్బంది సరస్సు ఒడ్డున ఉన్న ఉప్పును పెద్ద మొత్తంలో సేకరించి తమ నౌకకు తీసుకెళ్లారు.

33
గులాబీ రంగు నీటికి కారణమేమిటి?
Image Credit : Gemini AI

గులాబీ రంగు నీటికి కారణమేమిటి?

హిల్లియర్ సరస్సు మాత్రమే కాదు ప్రపంచంలో మరికొన్ని సరస్సులు కూడా ఇలా పింక్ కలర్ లో ఉంటాయి. అయితే ఇతర సరస్సుల గురించి ఏమో కానీ.. హిల్లియర్ సరస్సు ఇలా గులాబీ రంగులో కనిపించడానికి ఓ కారణం ఉంది. ఈ సరస్సులో డ్యూనెల్లా సలీనా (Dunaliella salina) అనే గులాబీ రంగు వర్ణద్రవ్యం కలిగిన ఆల్గే జాతి పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవుల వల్ల ఆ సరస్సు నీటికి ప్రత్యేకమైన రంగు వస్తుందని సమాచారం. హిల్లియర్ సరస్సులో గులాబీ రంగు ఏర్పడటానికి ఇదే కారణమని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నట్లు తెలుస్తంది.

హిల్లియర్ సరస్సులో ఈత కొట్టవచ్చా?

హిల్లియర్ సరస్సు అందాన్ని గాలిలో నుంచి చూసినప్పుడు మరింత స్పష్టంగా ఆస్వాదించవచ్చు. చుట్టూ విస్తరించిన పచ్చని అడవుల మధ్య గులాబీ రంగులో కనిపించే నీరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే, పర్యాటకులకు ఈ ద్వీపాన్ని సందర్శించే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది. హెలికాప్టర్ పర్యటనలు లేదా క్రూయిజ్ నౌకల ద్వారా కొందరు ప్రయాణికులు మిడిల్ ఐలాండ్‌కు చేరుకుంటారు.

మరో విశేషం ఏమిటంటే, సరస్సు నీటిని గాజు గ్లాసులో లేదా బకెట్‌లో తీసుకున్నా దాని గులాబీ రంగు కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ సరస్సు నీరు విషపూరితం కాదు. అంతేకాకుండా, అందులో ఉప్పు శాతం అధికంగా ఉండటం వల్ల నీటిలో మనుషుల శరీరం తేలేందుకు సహాయపడుతుంది. అందువల్ల మిడిల్ ఐలాండ్‌ను సందర్శించే అవకాశం లభిస్తే.. చాలా మంది టూరిస్టులు హిల్లియర్ సరస్సులో ఈత కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు కూడా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
-
Day 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
River : ఇండియాలో ఒకేనది, దేశం దాటగానే రెండు నదులుగా మారుతుంది.. ఈ నది ఏదో తెలుసా?
Recommended image2
Venomous Monkey: అబ్బా.. ఎంత ముద్దుగా ఉందో అనుకుంటే ప్రాణానికే ముప్పు.. విషపూరిత కోతి ఇది !
Recommended image3
ప్రపంచంలోనే అత్యధిక పోలీసులు పనిచేస్తున్న రాష్ట్రం మనదేశంలోనే ఉంది, ఆ రాష్ట్రమేది?
Related Stories
Recommended image1
Diamond Village: ఆంధ్రప్రదేశ్ లో మట్టిలో కూరుకుపోయిన వజ్రాల గ్రామం... ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం వెతుకుతున్న ప్రజలు
Recommended image2
Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved