MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • చలికాలంలో పాములు కళ్లుతెరిచే నిద్రిస్తాయా.. అదీ మూన్నాలుగు నెలలు..! ఎందుతో తెలుసా?

చలికాలంలో పాములు కళ్లుతెరిచే నిద్రిస్తాయా.. అదీ మూన్నాలుగు నెలలు..! ఎందుతో తెలుసా?

Snakes : శీతాకాలంలో పాములు ఎక్కువగా కనిపించవు… ఒకవేళ కనిపిస్తే గుంపులు గుంపులగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆందుకు ఓ ఆసక్తికరమైన కారణం ఉంది.    

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 08 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చలికాలంలో ఎక్కడికి వెళ్తాయి?
Image Credit : Asianet News

చలికాలంలో ఎక్కడికి వెళ్తాయి?

ప్రపంచంలోని అత్యంత విషపూరిత జీవులలో ఒకటిగా పిలిచే పాములు వేసవి, వర్షాకాలంలో చురుకుగా తిరుగుతాయి. కానీ చలికాలం రాగానే అకస్మాత్తుగా మాయమవుతాయి. ఈ సమయంలో పాములు ఏం చేస్తాయి? ఎక్కడికి వెళ్తాయి? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఆసక్తికరంగా ఉంటుంది.

27
పాముల హైబర్నేషన్ (శీతకాల నిద్ర)
Image Credit : Getty

పాముల హైబర్నేషన్ (శీతకాల నిద్ర)

పాములకు మనలా వెచ్చని రక్తం ఉండదు... వాటిని శీతల రక్త జీవులు అంటారు. బయటి వాతావరణం చల్లగా ఉంటే వాటి శరీరం కూడా చల్లబడుతుంది. శరీరం వేడిని ఉత్పత్తి చేయదు. అందుకే చల్లని వాతావరణంలో పాములు నెమ్మదిగా, బద్ధకంగా ఉంటాయి. వాటికి కదలడానికి శక్తి ఉండదు. ఎక్కువ శక్తిని వృథా చేయకుండా ఉండేందుకు అవి హైబర్నేట్ చేయడానికి ఎంచుకుంటాయి.

Related Articles

Related image1
Snake: ఈ చిట్కాలు పాటిస్తే.. పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..
Related image2
Snake Island: పాములు బాబోయ్ పాములు..! భూమ్మీద అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశం ఇదే
37
నిద్రలోకి మూన్నాలుగు నెలలు..
Image Credit : Getty

నిద్రలోకి మూన్నాలుగు నెలలు..

అవును… చలికాలం మొదలైనప్పుడు పాములు 3 నుంచి 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిద్రలోకి వెళ్తాయి. ఈ సమయంలో అవి ఆహారం, నీరు లేకుండా ఉండగలవు.

47
సురక్షిత ప్రాంతాల ఎంపిక
Image Credit : Getty

సురక్షిత ప్రాంతాల ఎంపిక

చలికాలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు పాములు వెచ్చదనం, రక్షణ కోసం సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతాయి. అవి సాధారణంగా నేలలోని లోతైన పగుళ్లు, పాత బొరియలు, రాళ్ల కింద లేదా చెట్ల వేర్ల వంటి వెచ్చని ప్రదేశాలలో దాక్కుంటాయి.

57
పాముల శీతాకాల నిద్ర
Image Credit : twitter

పాముల శీతాకాల నిద్ర

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు వెచ్చగా ఉండేందుకు చాలా పాములు ఒకేచోట కలిసి నిద్రపోతాయి. పాము శీతకాల నిద్రలోకి వెళ్లినప్పుడు దాని శ్వాస, హృదయ స్పందన నెమ్మదిస్తుంది. వాటి జీర్ణవ్యవస్థ కూడా పూర్తిగా ఆగిపోతుంది. వాతావరణం మారి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి మేల్కొని మళ్లీ చురుకుగా మారతాయి.

67
కళ్లు తెరిచే నిద్రపోతాయా?
Image Credit : Freepik

కళ్లు తెరిచే నిద్రపోతాయా?

పాముల కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుకే అవి ఎప్పుడూ నిద్రపోవని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి పాములకు కనురెప్పలు ఉండవు. వాటి కళ్లపై పారదర్శక పొర ఉంటుంది. ఇది వాటిని దుమ్ము, ధూళి నుంచి కాపాడుతుంది. అందుకే పాములు నిద్రపోతున్నప్పుడు లేదా హైబర్నేషన్‌లో ఉన్నప్పుడు కూడా వాటి కళ్లు తెరిచే ఉంటాయి.

77
భారత్‌లో అత్యంత విషపూరితమైనవి
Image Credit : Asianet News

భారత్‌లో అత్యంత విషపూరితమైనవి

ప్రపంచవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ పాము జాతులు ఉన్నప్పటికీ ఒక నివేదిక ప్రకారం, మన దేశంలో 69 ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. వీటిలో 29 సముద్ర పాములు, 40 భూమిపై నివసించేవి. కింగ్ కోబ్రా, కట్లపాము వంటివి భారతదేశంలో అత్యంత విషపూరితమైనవిగా చెబుతారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cigarette: ప్రపంచంలో మొదట సిగరెట్ ఎక్కడ తయారైంది.? చ‌రిత్ర ఏం చెబుతోంది
Recommended image2
Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే
Recommended image3
Facts: న‌దిలో నీరు తియ్య‌గా, స‌ముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకుంటాయో తెలుసా.?
Related Stories
Recommended image1
Snake: ఈ చిట్కాలు పాటిస్తే.. పాములు మీ ఇంటి దరిదాపులకు రావు..
Recommended image2
Snake Island: పాములు బాబోయ్ పాములు..! భూమ్మీద అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved