MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • చేతివేళ్లు విరిస్తే 'టక్' అని శబ్దం ఎందుకు వస్తుంది? దీని వెనుక అసలు కారణం ఇదే!

చేతివేళ్లు విరిస్తే 'టక్' అని శబ్దం ఎందుకు వస్తుంది? దీని వెనుక అసలు కారణం ఇదే!

చేతివేళ్లు విరిచినప్పుడు ‘టక్’ అనే శబ్దం ఎందుకు వస్తుంది? ఆ సమయంలో కీళ్లలో ఏం జరుగుతుంది? వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ లేదా ఇతర సమస్యలు వస్తాయా? శాస్త్రీయ కారణాలు తెలుసుకోండి.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 14 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేళ్ల నుండి టక్ మనే శబ్దం ఎలా వస్తుంది?
Image Credit : Gemini AI

వేళ్ల నుండి టక్ మనే శబ్దం ఎలా వస్తుంది?

చేతివేళ్లను వెనక్కి వంచినా, గట్టిగా లాగినా ‘టక్’ మని శబ్దం వస్తుంది… అందుకే చాలామందికి వేళ్ళు విరుచుకుంటూ ఈ శబ్దాన్ని వినడం ఓ అలవాటు. కొందరు పని మధ్యలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఇలా చేస్తుంటారు. మరికొందరికి వేళ్లు విరిస్తే ఏదో ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. అయితే చేతివేళ్లు విరిచినప్పుడు ఆ శబ్దం ఎందుకు వస్తుంది? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చేతివేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది?
Image Credit : Gemini AI

చేతివేళ్లు విరిచినప్పుడు శబ్దం ఎందుకు వస్తుంది?

మన చేతివేళ్లలో ఎముకలు ఒకదానితో మరొకటి కలిసే చోట కీళ్లు ఉంటాయి. వేళ్లు సులభంగా కదిలేందుకు ఈ కీళ్ల మధ్య సైనోవియల్ ద్రవం (Synovial fluid) అనే జారుడు పదార్థం ఉంటుంది. ఇది కీళ్లలోని ఉపరితలాల మధ్య ఘర్షణను తగ్గించి, వేళ్లు సజావుగా కదలడానికి సహాయపడుతుంది.

అయితే వేళ్లను బలంగా లాగినప్పుడు లేదా వంచినప్పుడు కీళ్ల మధ్య ఒత్తిడిలో మార్పు వస్తుంది. ఈ సమయంలో కీళ్లలోని సైనోవియల్ ద్రవంలో కరిగి ఉన్న వాయువులు ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా కీళ్లలో గ్యాస్‌తో నిండిన చిన్న ఖాళీ ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా ‘కావిటేషన్’ (Cavitation) అంటారు. ఈ మార్పుతో సంబంధం ఉన్న యాంత్రిక ప్రక్రియ వల్ల మనకు ‘టక్’ అనే శబ్దం వినిపిస్తుంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం వేళ్లను విరిచినా, గట్టిగా లాగినా కీళ్లమధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. దీంతో సైనోవియల్ ద్రవంపై పీడనం తగ్గి అందులో కరిగిన వాయువులు బుడగలుగా ఏర్పడతాయి. ఇవి పగిలినప్పుడే టక్ అనే శబ్దం వస్తుంది.

35
ఒకసారి వేళ్లు విరిస్తే వెంటనే మళ్లీ శబ్దం ఎందుకు రాదు?
Image Credit : Freepik

ఒకసారి వేళ్లు విరిస్తే వెంటనే మళ్లీ శబ్దం ఎందుకు రాదు?

చేతివేళ్లను ఒకసారి విరిచిన వెంటనే మళ్లీ అదే కీళ్లను విరిచినా సాధారణంగా శబ్దం రాదు. దీనికి కారణం కీళ్లలోని ద్రవం, ఒత్తిడి పరిస్థితులు వెంటనే మునుపటి స్థితికి చేరకపోవడమే. వేళ్లు విరిచిన తర్వాత కీళ్లలో ఏర్పడిన ఖాళీ, ద్రవంలోని మార్పులు తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అంటే బుడగలు ఏర్పడటానికి సమయం పడుతుంది. అందుకే అదే వేలును వెంటనే మళ్లీ విరిచినప్పుడు శబ్దం రాదు. కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి శబ్దం రావచ్చు.

వేళ్లు విరిస్తే కీళ్లకు ప్రమాదమా?

చేతివేళ్లు విరిచే అలవాటు ఉన్నవారిలో చాలామందికి కీళ్లు అరిగిపోతాయేమోననే భయం ఉంటుంది. అయితే సాధారణంగా నొప్పి లేకుండా వేళ్లు విరిచే అలవాటు వల్ల ఆర్థరైటిస్ వస్తుందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

అయితే వేళ్లను బలవంతంగా లాగడం, నొప్పి కలిగేంతగా వంచడం మాత్రం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కీళ్ల చుట్టూ ఉండే స్నాయువులు, ఇతర మృదు కణజాలాలపై ఒత్తిడి పడవచ్చు. ఇప్పటికే కీళ్లకు గాయం ఉన్నవారు లేదా వాపు, నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

45
వేళ్లు విరిచినప్పుడు ఉపశమనం ఎందుకు కలుగుతుంది?
Image Credit : Pexels

వేళ్లు విరిచినప్పుడు ఉపశమనం ఎందుకు కలుగుతుంది?

ఎక్కువసేపు ఒకే భంగిమలో పనిచేసినప్పుడు చేతివేళ్లు, మణికట్టు ప్రాంతంలో బిగుతుగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో వేళ్లను కదిలించడం లేదా సాగదీయడం వల్ల కొంత ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. వేళ్లు విరిచినప్పుడు వచ్చే శబ్దం కూడా ఆ అనుభూతిని మరింత స్పష్టంగా చేయవచ్చు.

అయితే శబ్దం రావడమే కీళ్లకు ప్రయోజనం కలిగిందని అర్థం కాదు. వేళ్లు విరవడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని లేదా చేతుల పనితీరు పెరుగుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. చేతులకు విశ్రాంతి ఇవ్వడం, మణికట్టు, వేళ్లను సున్నితంగా కదిలించడం బిగుతును తగ్గించుకోవడానికి ఉపయోగపడవచ్చు. దీంతో ఉపశమనం దక్కిన ఫీలింగ్ వస్తుంది.

55
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
Image Credit : Gemini AI

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

వేళ్లు విరిచినప్పుడు అప్పుడప్పుడు శబ్దం రావడం సాధారణమే. అయితే శబ్దంతో పాటు నొప్పి, వాపు, ఎర్రబడటం, వేళ్లను కదిలించడంలో ఇబ్బంది లేదా కీళ్లు పట్టేసినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గాయం తర్వాత శబ్దం రావడం మొదలైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మొత్తంగా చెప్పాలంటే.. చేతివేళ్లు విరిచినప్పుడు వచ్చే ‘టక్’ శబ్దం సాధారణంగా కీళ్లలోని ద్రవం, ఒత్తిడిలో మార్పులతో సంబంధం కలిగి ఉంటుంది. నొప్పి లేకుండా అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అయితే శబ్దం కోసం వేళ్లను పదేపదే బలవంతంగా విరవడం మాత్రం నివారించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
Recommended image2
SnakeBite: పాము కరిచిన చోట నోటితో విషం పీల్చవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?
Recommended image3
Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?
Related Stories
Recommended image1
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved