Viral Video: మనోడి ఐడియాకు చలి కూడా వణికిపోవాల్సిందే.. వైరల్ వీడియో
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని సమాచారాన్ని అందించేవి అయితే మరికొన్ని వినోదాన్ని పంచుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

విపరీతంగా వైరల్ అవుతున్న బైక్ రైడర్ వీడియో
ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. స్వెటర్లు, మఫ్లర్లు వేసుకున్నా గాలికి వణుకుతూనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక యువకుడు చలిని దూరం చేసుకోవడానికి చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారింది.
డ్రమ్‌తో చేసిన కవచం
ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి సాధారణ జాకెట్‌కి బదులుగా పెద్ద నీలి ప్లాస్టిక్ డ్రమ్‌ను తన శరీరానికి సరిపోయేలా కట్ చేసుకొని ధరించాడు. రోడ్డును చూడటానికి కళ్ల ముందూ చిన్న రంధ్రాలు, చేతులు బయటకు పెట్టేందుకు వీలుగా పక్కలా మరో రంధ్రాలు చేసుకుని… ఆ డ్రమ్‌ను పూర్తిగా కవచంలా మార్చుకున్నాడు.
బైక్ వెనుక ‘బెడ్ సెటప్’
ఇందులో మరింత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే… బైక్ వెనుక భాగంలో ఒక మంచాన్ని కట్టేశారు. ఆ మంచంపై దుప్పటి కప్పుకుని ఇంకొకరు సేదతీరుతూ ప్రయాణించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ठंड से बचने का देशी टेक्नोलॉजी का आविष्कार किया है, कैसी लगी हमारी टेक्नोलॉजी 😃
क्या कहना चाहेंगे आप? pic.twitter.com/HE4iHSLILY— Dashrath Dhangar (@DashrathDhange4) December 2, 2025
సోషల్ మీడియాలో రచ్చ
‘దశరథ్ ధంగే’ అనే యూజర్ ఈ వీడియోను X (ట్విట్టర్)లో “చలికి దేశీ టెక్నిక్… మీ అభిప్రాయం?” అంటూ షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఈ వీడియోను సరదాగా షేర్ చేస్తూ కామెంట్లతో సరదా చేస్తున్నారు. “ఇదే నిజమైన ఇండియన్ ఇంజనీరింగ్” అంటూ పొగడ్తలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరం అనిహెచ్చరిస్తున్నారు. డ్రమ్‌లో ఇరుక్కుని బైక్ నడపడం వల్ల బ్యాలెన్స్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

