MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?

అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?

US Hindu Priests : అమెరికాలో హిందూ పూజారులకు ఫుల్ డిమాండ్ ఉంది. వీళ్ళు ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయన్ని పొందుతున్నారు. వీళ్లు ఆదాయ మార్గాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

3 Min read
Author : Arun Kumar P
Published : Feb 07 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికాలో అర్చకత్వానికి ఫుల్ డిమాండ్...
Image Credit : Gemini ai

అమెరికాలో అర్చకత్వానికి ఫుల్ డిమాండ్...

విదేశాల్లో ఉద్యోగం చాలామంది యువతీయువకుల కల... డాలర్ డ్రీమ్స్ లో తేలియాడుతుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు మనోళ్ళు చదువు, ఉద్యోగాల కోసం ఎక్కువగా వెళుతుంటారు. ఇక్కడ ఐటీ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది... అందుకే ఇంజనీరింగ్ పూర్తిచేసే ప్రతి ఒక్కరు ఏదో సమయంలో అమెరికా కలగంటారు. డాలర్లలో శాలరీ, ఫాష్ లైఫ్ స్టైల్... అమెరికాలోని ఐటీ ఉద్యోగులను చూస్తే ఇదికదా లైఫ్ అనిపిస్తుంది.

అయితే ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల కంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న కొత్త జాబ్ వచ్చింది... ఇది కేవలం ఇండియన్స్ కు మాత్రమే. పెద్దగా చదువు అవసరం లేదు... పోటీ కూడా ఎక్కువగా ఉండదు. కానీ వీళ్లు ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తారట. ఇలా అమెరికాలో అత్యధికంగా సంపాదించే అవకాశం ఉన్న ఉద్యోగం అర్చకత్వం. అవును... మీరు వింటున్నది నిజమే. ప్రస్తుతం కొందరు అయ్యవార్లు పూజలతో ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారట... వాళ్ల ఆదాయ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెరికాలో అర్చకుల ఆదాయం ఎంత..?
Image Credit : ANI

అమెరికాలో అర్చకుల ఆదాయం ఎంత..?

అమెరికా అంటే ఐటీ ఉద్యోగులకు స్వర్గధామం అన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ అదే అమెరికాలో దేవాలయాల్లో పనిచేసేవారు, సొంతంగా అర్చకత్వం చేసుకునే హిందూ పూజారుల ఆదాయం ఐటీ ఉద్యోగులకు మించి ఉంటోందట. లక్షల డాలర్లు సంపాదించే అర్చకులు కూడా అమెరికాలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అమెరికాలో పెద్దపెద్ద ఆలయాలను నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్లుగా నడుస్తుంటాయి... ఇందులో పనిచేసే అర్చకులకు ఫిక్స్‌డ్ జీతంతో పాటు కొన్ని అదనపు సదుపాయాలు కూడా ఉంటాయి. కొత్తగా అర్చకత్వం చేసేవారికే సంవత్సరానికి సుమారు 30,000 నుండి 45,000 డాలర్ల శాలరీ ఉంటుంది. ఇక అనుభవం ఉన్న ప్రధాన అర్చకులకు సంవత్సరానికి 50,000 నుండి 70,000 డాలర్లు... కొన్ని పెద్ద దేవాలయాల్లో అయితే గరిష్ఠంగా 80,000 నుండి లక్ష డాలర్లు వరకు శాలరీ ఉంటుంది.

35
అమెరికా అర్చకులకు ఇతర ఆదాయం...
Image Credit : X/Banda Karthika Reddy

అమెరికా అర్చకులకు ఇతర ఆదాయం...

దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులకు నిర్వహకులే వసతి, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. అంటే శాలరీలోంచి పెద్దగా ఖర్చులు ఉండవు కదా ఇతర మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది. పండగలు, పర్వదినాల సమయంలో దేవాలయాలకు వచ్చే భక్తులు అర్చకుల ఆశీర్వాదం తీసుకుని దక్షిణ అందిస్తారు. ఇలా నెలనెలా ఎంతోకొంత ఆదాయం వస్తుంది.

పండుగల సమయంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతుంటాయి. ఇక వివాహాలు, వ్రతాలు వంటి శుభకార్యాలు కూడా ఆలయాల్లో జరుగుతుంటాయి. ఈ సమయంలో కూడా అయ్యవార్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇవన్నీ కలిపితే అర్చకుల ఆదాయం భారీగానే ఉంటుందని చెప్పొచ్చు.

45
ఇళ్లలో పూజలకు వేల డాలర్లు..
Image Credit : Gemini AI

ఇళ్లలో పూజలకు వేల డాలర్లు..

ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త ఇళ్లు కొన్నా, వ్యాపారాలు ప్రారంభించినా పూజలు చేస్తుంటారు. అలాగే పండగలు, ప్రత్యేక పర్వదినాల్లో సామూహిక పూజలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయంలో పూజారులకు భారీగా ఆదాయం లభిస్తుంది. ఇలాంటి పెద్దపెద్ద పూజలకు ఏకంగా రూ.20 నుంండి 40 వేల డాలర్ల వరకు తీసుకునే పూజారులు కూడా అమెరికాలో ఉన్నారట.

ఇక ఇళ్లలో చేసుకునే సత్యనారాయణ వ్రతాలు, చిన్నచిన్న పూజలకు 5,000 నుండి 10000 వేల డాలర్లు తీసుకుంటారట అర్చకులు. ఇలా ఆలయాల్లో అర్చకత్వం ద్వారానే కాదు బయట పూజల ద్వారా రెండుచేతులా సంపాదించే పూజారులు అమెరికాలో ఉన్నారు. మంచి ముహూర్తాలు, పర్వదినాలు కలిగిన నెలల్లో రూ.10 నుండి 20 లక్షలు కూడా సంపాదిస్తారు.

55
పూజారులుగా మారుతున్న విద్యార్థులు...
Image Credit : Freepik

పూజారులుగా మారుతున్న విద్యార్థులు...

ఐటీతో పాటు ఇతర రంగాల్లో హెవీ కాంపిటేషన్... కానీ అర్చకత్వంలో ఉండదు. కాబట్టి దైవభక్తి ఎక్కువగా ఉండి పూజా కార్యక్రమాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఇప్పుడు పార్ట్ టైమ్ పూజారులుగా మారుతున్నారట. ఇలా చదువుకోసం అమెరికాలో ఉంటున్నవారు పార్ట్ టైమ్ పూజారులుగా లేదంటే అర్చకులకు సహాయకులగా వ్యవహరిస్తున్నారు. ఇలా భక్తికి భక్తి, ఆదాయానికి ఆదాయం పొందుతున్నారు.

పోటీ ఎక్కువ ఉండదు కాబట్టి అర్చకులకు వీసాలు చాలా సులభంగా వస్తాయి. అమెరికాలో కొందరు గ్రీన్ కార్డు హోల్డర్ అర్చకులు కూడా ఉన్నారట. ఇలా నిష్టగా, భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అయ్యవార్లకు అమెరికాలో మంచి అవకాశాలున్నాయి. కొందరు అర్చకులు ఇంట్లోనే టెంపుల్ కట్టుకుని ఆదాయం పొందుతున్నారు. ఇలా అమెరికాలో అర్చకులు మంచి ఆదాయంతో పాటు గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఉద్యోగాలు, కెరీర్
పర్సనల్ పైనాన్స్
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Related Stories
Recommended image1
తరతరాలుగా ఆ దుర్గా ఆలయంలో ముస్లింలే పూజారులు.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందంటే.. ?
Recommended image2
అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం : మోదీ ప్రారంభించిన ఈ గుడి గురించి 10 ముఖ్యమైన అంశాలివే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved